Monday, May 20, 2024
- Advertisement -

పంట పండింది

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పంట పండింది. తెలంగాణ ముఖ్యమంత్రి క.చంద్రశేఖర రావు ప్రజాప్రతినిధులకు వరాల మీద వరాల జల్లు కురిపించారు. నిన్నది దాకా ఉన్నా ఉన్న జీత భత్యాలు నేటి నుంచి రెట్టింపు అయ్యాయి. అంతే కాదు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా విశేషంగా పెరిగాయి.

మరోవైపు తెలంగాణ జిల్లాల్లోని మర్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో తెలంగాణ మంగళవారం నాడు శాసనసభ ఆనందడోలికల్లో తేలింది. జీతాలు రెట్టింపు చేయడం, నియోజగవర్గ నిధులను మూడు కోట్లకు పెంచడంతో పాటు ఆ నిధులు ప్రజాప్రతినిధులే నేరుగా ఖర్చు చేపే విధంగా నిర్ణయించడం వంటి అంశాలు తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఆనందాన్ని పంచాయి.

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు పెంచడంపై బిజెపి పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు భోళాశంకరుడని కొనియాడారు. ఇక మార్కెట్ కమిటీలో మహిళలకు రిజర్వేషన్ పై కొందరు మహిళా ఎమ్మెల్యేలు శాసనసభలో కెసిఆర్ వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -