Saturday, May 18, 2024
- Advertisement -

కొరియాస‌మీప‌జ‌లాల్లోకిఅమెరికా యుధ్ద‌నౌక‌లు-యుధ్ద‌వాతా వ‌ర‌ణం

- Advertisement -
Trump sends aircraft carrier to waters off Korea

ఉత్త‌ర‌కొరియా…అమెరికా   రెండు దేశాల మ‌ధ్య‌ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది…నిత్యం రెండు దేశాల మ‌ధ్య మాట‌లు తూఆల్లా పేలుతుంటాయి.పెద్ద‌న్న‌మాట‌లను  ,ఐక్య‌రాజ్య స‌మితి హెచ్చ‌రిక‌ల‌ను లెక్క‌చేయ‌కుండా అణుప‌రీక్ష‌లు కొన‌సాగిస్తోంది.

రెండు  దేశాల మ‌ధ్య వైరం జ‌ఠిలంగా మారుతుండంటంతో యుధ్ద వాతావ‌ర‌ణ స‌మ‌స్య‌లు  నెల‌కొన్నాయి.తాజాగా అమెరికాకు చెందిన  నావికాద‌ళ బృందం ఉత్త‌ర‌కొరియా స‌మీప‌జ‌లాల్లో్కి  వెల్లింది. దికార్ల్  విన్సాన్ స్ట్రెక్  గ్రూప్‌గా పిలిచే బృందం యుధ్ద‌నౌక‌లు, విమాన వాహ‌క‌నౌక‌తో  స‌హా అప్రాంతానికి  వెల్ల‌డంతో  ఇరు  దేశాల  మ‌ధ్య  తీవ్ర  ఉద్రిక్త‌త ప‌రిస్తితులు  నెల‌కొన్నాయి.అమెరికాలోని  ప‌సిఫిక్ క‌మాండ్ అదేశాల  మేర‌కే  అక్క‌డికి  వెల్లిన‌ట్లు  స‌మాచారం. ఇటీ వ‌ల  అమెరికా  అధ్య‌క్షుడిగా ట్రంప్  ఎన్న‌కైన త‌ర్వాత  ఉత్త‌ర కొరియా  క్షిప‌ణీ  ప‌రీక్ష‌లు  అప‌క‌పోతే ఒంట‌రిగానే  తేల్చుకుంటామ‌నీ  ప్ర‌క‌టించిన త‌రునంలోనే అమెరికా యుధ్ద‌,విమాన  వాహ‌క‌నౌలు ఉత్త‌ర  కొరియా జ‌లాల్లోకి వెల్ల‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

అగ్ర‌దేశాల హెచ్చ‌రిక‌ల‌ను,ఐక్య‌రాజ్య  స‌మితి సూచ‌న‌ల‌ను లెక్క‌చేయ‌కుండా  క్షిప‌ణీ ప‌రీక్ష‌లును నిర్వ‌హిస్తూ స‌వాల్లు విసురుతోంది.జ‌పాన్ స‌ముద్ద జ‌లాల్లోకి  బాలిస్టిక్ క్షిప‌ల‌ణుల‌ను ప్ర‌యేగించి  మ‌రోసారి పొరుగు దేశాల‌కు అగ్ర‌హం  తెప్పిస్తోంది.ఆత్త‌ర కొరియా చ‌ర్య‌ల‌తో  ఆప్రాంతంలో మొట్ట‌మొద‌టి ముప్పుగా అమెరికా భావిస్తోంది.ఇటీవ‌ల త‌రుచుగా కొన‌సాగిస్తున్న అణ్వాయుధ‌, బాలిస్టిక్ మీడియం రేంజ్‌క్షిప‌ణీ  ప‌రీక్ష‌లను నిర్వ‌హిస్తూ  స‌మ‌స్య‌ను మ‌రింత జ‌ఠిలం చేస్తున్నాయి.ఉత్త‌ర‌కొరియాపై క్షిప‌ణి,అనుప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా ఐక్య‌రాజ్య స‌మితి ఆంక్ష‌లు విధించినా వాట‌న్నంటినీ ఖాత‌రు చేయ‌కుండా క్షిప‌ణీ స‌మ‌ర్త్యాన్ని  పెంచి ప‌రీక్షిస్తోంది.ఇలాంటి ప‌రీక్ష‌లు కొత్తేం కాక‌పోయినా తాజాగా జ‌పాన్ జ‌లాల్లోకి క్షిప‌ణుల‌ను ప్ర‌యేగించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ ఎన్నికైన త‌ర్వాత ఉత్త‌ర కొరియా మీద కారాలు మిరియాలు రూరుతున్నారు.మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా లాగా చూస్తూ ఊరుకోమ‌ని అవ‌స‌రం అయితే ఏక‌ప‌క్షంగానైనా చ‌ర్య‌లు తీసుకుంటామ‌నీ ట్రంప్ హెచ్చ‌రిక‌లు జారీచేశారు.చైనా స‌హాకారంతోనే అణుప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంద‌నీ … వెంట‌నే ప‌రీక్ష‌లు నిలిపివేసేవిధంగా చైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌నీ ఇటీవ‌లే ట్రంప్ హెచ్చ‌రించారు.ఇటీ వ‌లే చైనా అధ్య‌క్ష‌డు జిన్‌పింగ్‌తో ట్రంప్  స‌మావేశం నిర్వ‌హించారు.ఈస‌మావేశంలో వ్యాపార సంభంధాల‌తో పాటు ఉత్త‌ర‌కొరియా దుందుడుకు చ‌ర్య‌ల‌పై  ఇరుదేశాల అధినేత‌లు చ‌ర్చ‌లు జ‌రిపారు.చ‌ర్చ‌లు పూర్త‌యిన రెండు రోజుల‌కు అమెరికా యుధ్ద ,విమాన వాహ‌క‌నౌక‌లు ఉత్త‌ర కొరియా స‌మీప జ‌లాల్లోకి వెల్ల‌డం అంత‌ర్జాతీయంగా  ఉద్రిక్త ప‌రిస్తితులు నెల‌కొన్నాయి.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -