Thursday, May 2, 2024
- Advertisement -

సైన్యం లో మహిళల పై చిన్న చూపు.. సుప్రీంకు చేరిన పిటిషన్..!

- Advertisement -

సైన్యంలో మహిళల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలంటూ గత ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరుతూ సైనికాధికారిణులు సుప్రీం కోర్టును మళ్లీ ఆశ్రయించారు. సహేతుకమైన, సముచితమైన రీతిలో పదోన్నతులు, తదనంతర ప్రయోజనాలు అందేలా చూడాలని లెఫ్టినెంట్ కర్నల్ ఆషు యాదవ్, మరో 10 మంది అధికారిణులు ఒక పిటిషన్లో కోరారు. న్యాయస్థాన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. సాంకేతిక, విధానపరమైన అంశాల పేరిట తమ హక్కులను పరోక్షంగా తుంగలో తొక్కుతున్నారని తెలిపారు.

మహిళలకు సముచిత అవకాశాలు కల్పించకుండా భారత సైన్యం గత ఏడాది ఆగస్టు 1న కొన్ని సాధారణ ఆదేశాలు జారీ చేసింది. 45 ఏళ్లు దాటి మెనోపాజ్​కు చేరువగా ఉన్నవారు, అవివాహిత మహిళా అధికారిణులు కూడా గర్భానికి సంబంధించిన పరీక్ష చేయించుకోవాలనేది దానిలో ఒక అంశం. ఏదో ఒక రకంగా మహిళల్ని అనర్హుల్ని చేయడానికే నిబంధనల్ని రూపొందించినట్లు కనిపిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా పురుషులు చేయగలుగుతున్న పనులన్నీ మేం చేస్తున్నా అన్యాయానికి గురవుతున్నాం. కాల పరిమితితో కూడిన పదోన్నతుల్లోనూ న్యాయం జరగడం లేదు అని పిటిషన్ లో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -