మీ అధ్య‌క్షున్ని క‌ల‌వాల‌ని ఎవ‌రు అడిగారు….

There will be no Modi-Xi meeting planned at G20…clarifies indian government

కొన్ని రోజులుగా సిక్కిం స‌రిహ‌ద్దుల్లో భార‌త్ ,చైనాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.ఇరు దేశాలు ఈమ సైన్యాన్ని మోహ‌రించాయి.మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది.ప్ర‌తీసారి చైనా భార‌త్ ను టార్గెట్ చేయ‌డం సైనిక చ‌ర్య‌తీసుకుంటామ‌ని హెచ్చ‌రించ‌డం ప‌రిపాటిగా మారింది.

అయితే భార‌త్‌కూడా అదేస్థాయిలో ఘాటుగా స్పందించింది.
తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీతో తమ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సమావేశమయ్యేటంత సాధారణ పరిస్థితులు లేవని చైనా స్పష్టం చేసింది. త్వరలో హాంబర్గ్‌లో జరగనున్న జీ 20 సదస్సులో జిన్‌పింగ్‌ ప్రధానితో మోదీతో అవనున్న భేటీని రద్దు చేసుకున్నట్లు తెలిపింది. సిక్కింలో ఏర్పడిన సరిహద్దు వివాదంపై గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

{loadmodule mod_custom,GA1}

ఇప్పుడు తాజాగా చైనాకు ఘ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది భార‌త్‌.జిన్ పింగ్ తో భేటీ కావాలని మిమ్మల్ని ఎవరడిగారంటూ కౌంటర్ ఇచ్చింది. చైనా అధినేతను కలవాలనే ఆలోచనే తమకు లేదని… అలాంటప్పుడు, అనుకూల వాతావరణం అనే ప్రశ్నే లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ లో మోదీ వెంట ఉన్న ఓ సీనియర్ అధికారి తెలిపారు.

Related

  1. ప్రాధాన్య‌త సంత‌రించుకున్న మోదీ ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న‌.. భారీగా ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు..
  2. భార‌త్ హిందూ స‌ముద్ర‌ జ‌లాల్లో చైనా యుద్ధ నౌక‌లు….
  3. స‌రిహ‌ద్దుల్లో డ్రాగ‌న్ దుస్సాహ‌సం..
  4. ఆర్మీఛీప్ సిక్కింప‌ర్య‌ట‌న‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…