Tuesday, May 21, 2024
- Advertisement -

జీడీపీ భ‌యంతో మిశ్ర‌మ ఫ‌లితాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు ….

- Advertisement -

దేశీయ స్టాక్‌మార్కెట్లు మిశ్ర ఫ‌లితాల‌తో ముగిసాయి. రెండు రోజులు నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. శుక్రవారం లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో న‌ష్టాల‌తో మొద‌ల‌యిన మార్కెట్లు త‌ర్వాత లాభాల బాట ప‌ట్టాయి. మదుపర్లు ఐటీ షేర్ల కొనుగోళ్లకు మక్కువ చూపడంతో దేశీయ సూచీలు క్రమంగా లాభాల్లోకి వెల్లాయి.

ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి జీడీపీ డేటా ఈరోజు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 45 పాయింట్లు కోల్పోయి 38,645కి పడిపోయింది. నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 11,680కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వెల్స్ పన్ ఇండియా (8.87%), హట్సన్ ఆగ్రో ప్రాడక్ట్స్ (8.58%), హెచ్డీఐఎల్ (7.91%), సీసీఎల్ ప్రాడక్ట్స్ ఇండియా (6.76%), జై కార్ప్ (6.08%).

టాప్ లూజర్స్:
వక్రాంగీ (-8.19%), యస్ బ్యాంక్ (-5.11%), కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ (-4.99%), క్వాలిటీ (-4.95%), ఏజీస్ లాజిస్టిక్స్ (-3.50%).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -