Sunday, May 19, 2024
- Advertisement -

నిమిషం ఆలస్యమైనా.. అంతే..

- Advertisement -

ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆదివారం నాడు జరుగనున్నది. పరీక్షా కేంద్రాలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరు. దీంతో పాటు ఈసారి పరీక్షలన్నీ ప్రభుత్వ విద్యాసంస్ధల్లోనే నిర్వహిస్తూండడంతో ఇవి ఎక్కడ ఉన్నాయో ముందుగానే తెలుసుకుంటే అభ్యర్ధులకు మేలు జరుగుతుంది. తమక కేటాయించిన సెంటర్ ఎక్కడుంది.

ఎంత సమయంలో అక్కడికి చేరుకోచ్చు అనేది శనివారమే అభ్యర్ధులు తెలుసుకుంటే ఆదివారం నాడు పరీక్షకు ఆలస్యంగా వెళ‌్లే అవకాశం ఉండదు.  పరీక్షకు వెళ్లే అభ్యర్ధులు రెండు హాల్ టిక్కట్లు ఉన్న ప్రతినే తీసుకువెళ్లాలని, హాల్ టిక్కట్ పై ముందుగానే ఫొటోను అతికించాలని అధికారులు సూచించారు. పేపర్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి పన్నెండున్నర వరకూ జరుగుతుంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షా నూట ఎనభై నాలుగు మంది అభ్యర్ధులు హాజరవుతున్నారు.

దీనికి 443 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక పేపర్ టూ పరీక్ష మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకూ జరుగుతుంది. దీనికి రెండు లక్షల 73 వేల 310 మంది అభ్యర్ధులు హాజరవుతున్నారు. ఇందుకోసం 1,175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా ఆయా రూట్లలో ఆర్ టి సి బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్ధులు ఆల్ ద బెస్ట్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -