Sunday, May 19, 2024
- Advertisement -

గ్రేటర్ ఎన్నికలకు గులాబీ దండు రెడీ అయ్యింది

- Advertisement -

గెలుపే లక్ష్యంగా.. కదనరంగంలో దూకాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై సమీక్షించిన కేసీఆర్.. డివిజన్ల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈసారి ఎలాగైన మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుని.. బల్దియాలో జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గెలుపు వ్యూహాలను ఖరారు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు గ్రేటర్ ఎన్నికల్లో బాధ్యతలు తీసుకోవాలన్న కేసీఆర్ వారికి డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఈనెల 6 నుంచి డివిజన్‌ బాధ్యులు ప్రచారం ప్రారంభించాలని సూచించారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా వస్తున్నాయని, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదన్నారు. అభ్యర్థుల ఎంపిక సర్వేల ఆధారంగానే ఉంటుందని, ఎవరి సిఫార్సులు అంగీకరించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎంఐఎంతో ఎన్నికల పొత్తుపై ఇప్పటివరకు ఎలాంటి అవగాహన లేదని కేసీఆర్ తెలిపారు.

సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేపట్టిన టీఆర్ఎస్, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోను విజయఢంకా మోగించింది. మరి త్వరలో జరగబోతున్న గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటి ఎలాటైన బల్దియాపై జెండా ఎగురవేయాలని ప్లాన్ చేస్తోన్న కేసీఆర్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -