Saturday, May 18, 2024
- Advertisement -

పాలేరుపై అధికార పక్షం వ్యూహరచన

- Advertisement -

తెలంగాణలో నానాటికి తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి పాలేరు ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ఎలాగైనా విజయం సాధించాలని టిఆర్ఎస్ నాయకత్వం పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోజుకో వ్యూహాన్ని మారుస్తూ ప్రత్యర్ధి కాంగ్రెస్ ను ఇరుకున పెడుతోంది.

ఉప ఎన్నికే అయినా ఏకంగా క్యాబినెట్ మంత్రిని బరిలో దింపడం, మరో మంత్రి, స్వయాన ముఖ్యమంత్రి కుమారుడు కె.తారక రామారావునే ఎన్నికల పర్యవేక్షకునిగా నియమించారు. దీంతో పాలేరులో పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సానుభూతితో ఓటర్ల మనసు గెలుచుకోవాలనుకుంటే టిఆర్ఎస్ మాత్రం చేసిన అభివృద్ధి చూపించి విజయాన్ని దక్కించుకోవాలనుకుంటోంది. మరోవైపు ఆపరేష్ ఆకర్షను కూడా చేపట్టిన టిఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో ఇతర పార్టీల్లో ఉన్న ముఖ్యమైన నాయకులను తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను తమ దారికి తెచ్చుకుంది టిఆర్ఎస్.  గెలుపే లక్ష్యంగా టిఆర్ఎస్ మంత్రులను కూడా పాలేరులో మోహరించి ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తు ప్రత్యర్ధి కాంగ్రెస్ నాయకులకు నిద్ర లేకుండా చేస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -