Thursday, May 16, 2024
- Advertisement -

అమెరికాపై వామ‌ప‌క్షాల కన్నెర్ర‌

- Advertisement -

హైద‌రాబాద్‌లో ట్రంప్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

పాలస్తీనాకు రాజ‌ధానిగా ఇస్తాంబుల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేగుత్తున్నాయి. పాల‌స్తీనా ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అమెరికా సామ్రాజ్య‌వాదానికి ఇది తాజా నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌పంచ దేశాలు వ్య‌తిరేకిస్తున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్రంప్‌కు, అమెరికా సామ్రాజ్య‌వాదానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మ‌న‌దేశంలోనూ ఆందోళ‌న‌లు చెల‌రేగుతున్నాయి.

ప్ర‌ధానంగా క‌మ్యూనిస్టు పార్టీలు ఈ అంశంపై అమెరికా దేశంపై, అధ్య‌క్షుడు ట్రంప్‌పై ఆందోళ‌న చేస్తున్నారు. తాజాగా హైద‌రాబాద్ బ‌షీరాబాగ్‌లో క‌మ్యూనిస్టు పార్టీల‌న్నీ ఆందోళ‌న చేశాయి. సోష‌లిస్ట్ యూనిట్ సెంట‌ర్ ఆఫ్ ఇండియా (క‌మ్యూనిస్టు- ఎస్‌యూసీఐ (సీ)) పార్టీ, సీపీఐ, సీపీఐ ఎం, సీపీఎం న్యూ డెమెక్ర‌సీ, ఎంసీపీఐ యూ, సీపీఐ ఎంఎల్ లిబ‌రేష‌న్‌, ఆర్ఎస్‌పీ, ఏఐఎఫ్‌బీ త‌దిత‌ర మొత్తం ప‌ది వామ‌ప‌క్ష పార్టీలు అమెరికా ప్ర‌భుత్వంపై మండిపడుతున్నారు.

అమెరికా సామ్రాజ్య‌వాదం రోజురోజుకు పెరిగిపోతోంద‌ని, ట్రంప్ దుందుడుకు చ‌ర్య‌ల‌తో ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్నాడ‌ని ఎస్‌యూసీఐ (సీ)) పార్టీ రాష్ర్ట నాయ‌కులు ఎస్‌.గోవింద‌రాజులు పేర్కొన్నారు. ప్ర‌పంచాన్నంతా యుద్ధ భ‌యంలో ముంచెత్తుతున్నాడ‌ని, దీనికి న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం వ‌త్తాసు ప‌లుకుతోంద‌ని ఆరోపించారు. అమెరికా, ర‌ష్యా, చైనా, భార‌త్ క‌లిసి త‌మ ఆయుధాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ ఆయుధ సంప‌త్తిని పెంచుకోవ‌డానికి చూస్తున్నార‌ని తెలిపారు. అమెరికా ప్ర‌భుత్వం వెంట‌నే నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాల‌ని, చిన్న దేశాలపై అమెరికా పెత్త‌నానికి వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టులంద‌రూ క‌లిసి పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -