Tuesday, May 21, 2024
- Advertisement -

హైద‌రాబాద్‌ రోడ్ల‌పై సంద‌డి చేస్తున్న ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులు..

- Advertisement -

న‌గ‌రంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని త‌గ్గించేందు తెలంగాణా ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. అందులో భాగంగానే ఆర్టీసీ ఎలక్ట్రిక‌ల్ బ‌స్సుల‌ను భాగ్య‌న‌గంలో ప్ర‌వేశ పెట్టింది. ఈ బ‌స్సులు రోడ్ల‌పై సంద‌డి చేయనున్నాయి. ఈరోజు (బుధ‌వారం) 5 బ‌స్సుల‌ను లాంభ‌నంగా ప్రారంభించారు.

టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో 40 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. అందుబాటులోకి వచ్చాయి. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.మొదటి దశలో ఈ బస్సులను శంషాబాద్ విమానాశ్రయానికి నడపనున్నట్లు అజయ్ మిశ్రా తెలిపారు.

ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఇంధన ఖర్చును బాగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా ఇంధనంతో నడిచే బస్సులతో పోలిస్తే.. ఈ బస్సుల వల్ల శబ్ద కాలుష్యం, గాలి కాలుష్యం బాగా తగ్గుతుంది. ఈ బ‌స్సుల‌ను ఒక్క‌సారి రీఛార్జ్ చేస్తే 300 కి.మీ. వ‌ర‌కు ప్ర‌యానించ‌వ‌చ్చును. ఇంధ‌నం ఖ‌ర్చు త‌క్కువ కావ‌డంతోపాటు కాలుష్యాం కూడా త‌గ్గ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -