Thursday, May 16, 2024
- Advertisement -

టీవీ9 సంస్థ‌తో ర‌విప్ర‌కాశ్‌కు ఎటువంటి సంబందంలేదు.. ఏబీసీఎల్ బోర్డు స్పష్టీకరణ

- Advertisement -

టీవీ9 న్యూస్ ఛానెల్‌లో నెలకొన్న గంద‌ర‌గోల పరిస్థితులకు ఎట్ట‌కేల‌కు శుభం కార్డు ప‌డింది. ఈ రోజునుంచి టీవీ9 సంస్థ కొత్త యాజ‌మాన్యం చేతుల్లోకి వెల్లింది. దీనికి సంబంధించి ఈ సంస్థ డైరెక్టర్లు ప్రెస్‌మీట్ పెట్టారు. టీవీ9 సీఈవో, డైరెక్టర్‌ పదవి నుంచి రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నట్లు ఈ సంస్థ డైరెక్ట‌ర్ సాంబ‌శివ‌రావు తెలిపారు. ర‌విప్ర‌కాశ్‌తో పాటు సీవోవో మూర్తిని కూడా తొల‌గించామ‌ని తెలిపారు. ఇప్ప‌టినుంచి టీవీ9 సంస్థ‌ల‌తో వారికి ఎటువంటి సంబంధంలేద‌ని క్లారిటీ ఇచ్చారు. రవి ప్రకాశ్‌ స్థానంలో కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా గొట్టిపాటి సింగారావు నియమిస్తున్నట్లు సాంబ‌శివారు వెల్లడించారు.

ఏబీసీఎల్‌లో 90.5శాతం వాటాను 9 నెలల క్రితం అలందా మీడియా టేకోవర్ చేసింద‌న్నారు. కొనుగోలు అనంతరం సంస్థలో చాలా అవరోధాలు సృష్టించారని ఆయన వెల్లడించారు. సంస్థలో 8శాతం వాటా ఉన్న వాళ్లు నియంత్ర చేయాలని చూశారని, వాటాదార్లందరి అభిప్రాయం మేరకే రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నామని ఆయన ప్రకటించారు. బోర్డు డైరెక్ట‌ర్ల మీటింగ్ జ‌ర‌ప‌కుండా న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉన్నాయంటూ ర‌విప్ర‌కాశ్ అడ్డంకులు సృష్టించార‌న్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు కూడా మా పేర్లను పంపలేదు. ఈనెల 8న బోర్డు మీటింగ్ నిర్వహించి హోల్‌టైమ్ డైరెక్టర్ పదవి నుంచి రవిప్రకాశ్‌ను తొలగించామ‌న్నారు. కొత్తగా నలుగురు డైరెక్టర్లు కేశవరావు, సాంబశివరావు, జగపతి రావు, శ్రీనివాస్ టీవీ9 గ్రూపు బోర్డులోకి వచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -