Saturday, May 18, 2024
- Advertisement -

ఉత్తరాఖండ్ లో మారుతున్న రాజకీయం

- Advertisement -

విశ్వాస పరీక్షకు ముందు ఉత్తరాఖండ్ లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది. తమను అనర్హులుగా స్పీకర్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. అయితే వీరి అప్పీలును హైకోర్టు తిరస్కరించింది.

దీంతో మంగళవారం నాడు జరుగనున్న బలపరీక్షలో ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనే వీలు లేకుండా పోయింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగినట్లు అయ్యింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. మరో వైపు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -