Friday, May 17, 2024
- Advertisement -

ముందస్తు ఎన్నికలు ఇప్పట్లో లేవు : వెంకయ్య నాయుడు

- Advertisement -
Venkaiah Naidu responds on earlier election

దేశంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై దేశ వ్యాప్తంగా ఎంత చ‌ర్చ జ‌రిగిందో అంద‌రికే తెలిసిందే. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏక‌కాలంలో పార్ల‌మెంట్‌, అసెంబ్లీ ఎన్నికులు జ‌ర‌గాని వ్యాఖ్యానించ‌డంతో దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ ప‌ర్టీలు, ప్ర‌జ‌ల‌లో విస్త్రుతంగా చర్చ‌జ‌రిగింది. ముంద‌స్తు ఎన్నిక‌ల వార్త‌ల నేప‌థ్యంలో రాష్ట్రాలు కూడా అందుకు సానుకూలంగా స్పందిస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్ప‌టికే పార్టీ శ్రేణులు ముంద‌స్తు ఎన్నిక‌లు సిద్ధంగా ఉండాల‌ని సంకేతాలిచ్చాయి.అదిశ‌గా అన్ని పార్టీలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న త‌రునంలో కేంద్ర స‌మాచార శాఖ మంత్రి వెంక‌య్య‌నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఇప్ప‌ట్లో అయితే ముంద‌స్తు ఎన్నిక‌లు లేవ‌ని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందస్తు ఎన్నికలు రావొచ్చునని వస్తున్న వార్తలు అన్నీ ఊహాగానాలేనని, అందులో ఎంతమాత్రమూ వాస్తవం లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు చెప్పారు. ఏ రాష్ట్రానికీ ముందుగానే ఎన్నికలు వస్తాయని తాను భావించడం లేదని, ఏక కాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరపాలన్న ఆలోచన అమల్లోకి రావడానికి ఎంతో కాలం పట్టవచ్చని వెంకయ్య అభిప్రాయపడ్డారు. దీనిపై దేశ వ్యాప్తంగా రాజ‌కీయ పార్టీల‌తో విస్త్రుతంగా చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌ని తెలిపారు.
ఇటీవల ముందస్తు అంశంపై జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందస్తుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే, ముందస్తు వచ్చినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అన్నారని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇప్పుడు దీనిపై వెంకయ్య స్పందించారు. ఇక రాజ‌కీయ ప‌ర్టీలు ఊపిరి పీల్చుకోవ‌చ్చు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. ద‌మ్ముంటే కాసుకోండి.. ఢిల్లీమాదే ..అమీత్‌షాకు మ‌మ‌త‌స‌వాల్‌
  2. ఎన్నికలకు… సీతాదేవికి లింకేంది బాబు…!
  3. ఏరాయి అయితేనే ప‌ల్లు ఉడ‌గొట్టుకొనేదానికి
  4. 2019 ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ బాహుబ‌లి.. లోకేష్ ఒక క‌మెడియ‌న్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -