Wednesday, May 15, 2024
- Advertisement -

లిక్క‌ర్ కింగ్ విజ‌య్‌మాల్యా లండ‌న్‌లో అరెస్ట్‌…

- Advertisement -
Vijay Mallya arrested in London

విజ‌య్‌ మాల్యా పేరు ప‌రిచ‌యంలేని వ్య‌క్తులుండ‌రు. లిక్క‌ర్ కింగ్ సామ్రాజ్య‌నేత‌. స్వదేశంలో బ్యాంకులకు 9వ‌లే  కోట్ల రుణాలు ఎగవేసి లండన్‌కు పారిపోయ‌ని విష‌యం తెలిసందే. ఏడాది కాలంగా ఇండియన్ పోలీస్ ను ముప్ప తిప్పలు పెడుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎట్టకేలకు  పోలీసులకు చిక్కాడు. ఈ రోజు ఆయన్ను లండన్ లో స్కాట్ లాండ్ యార్డు పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ మినిష్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు ఆయన్ను హాజరుపరుస్తారు.  ఇండియాకి ఓ ఒప్పందం కుదురడంతో ఈ అరెస్టు సాధ్యమైనట్లు తెలుస్తోంది.

దేశం నుంచి తప్పించుకొని పారిపోయిన విజయ్ మాల్యాపై ఏప్రిల్ 2016లో ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసింది. 2017, జనవరిలో సీబీఐ కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. న్యాయస్థానాలు ఎన్ని  సార్లు సమన్లు జారీ చేసినా మాల్యా నుంచి రెస్పాన్సు లేదు. తనకు జారీ చేసిన సమన్లపై స్పందించకుండా మొండి వైఖరి కనబర్చారు. అంతేగాక లండన్ లో ఎంజాయ్ చేస్తూ.. ఆ ఫొటోలను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ మరింత రెచ్చగొట్టేవాడు. ఆయనను భారత్ కు రప్పించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవీ ఫలితంచలేదు.  చివరకు ఇటీవల ఫిబ్రవరిలో మన ప్రభుత్వం ఈ వ్యవహారంపై  బ్రిటన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మాల్యాను అరెస్టు చేయాలని కోరింది. ఆ మేరకు కుదిరిన ఓ ఒప్పందం ప్రకారం అక్కడి పోలీసులు మాల్యాను  అరెస్టు చేశారు. 

భారత్‌లో ఆయ‌న‌కు ఉన్న  ఆస్తులు చూసుకుంటే……

….యునైటెడ్‌ బ్రూవరీస్‌లో 33 శాతం వాటా ఉంది. దీని విలువ రూ.7000 కోట్లు. అయితే ఇందులో సగ భాగం తనఖా కిందే ఉంది. 

…మంగళూర్‌ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌లో 22 శాతం వాటా ఉంది. దీని విలువ రూ.140 కోట్లు. ఇందులోనూ మూడింట ఒక వంతు తనఖా కింద ఉంది. 

….యూబీ హోల్డింగ్స్‌లో 52 శాతం వాటా ఉంది. బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో స్థిరాస్తున్నప్పటికీ.. వాటి బాడుగలన్నీ తనఖా కిందే ఉన్నాయి. 

బేయర్‌ క్రాప్‌ సైన్సెస్‌లో 1 శాతం వాటా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఆ కంపెనీకి మాల్యానే ఛైర్మన్‌.

కొనుగోళ్లు

….2005.. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభం. షా వాలెస్‌ను కొనుగోలు చేశారు. తద్వారా రాయల్‌ ఛాలెంజ్‌ వంటి విస్కీ బ్రాండ్లను సొంతం చేసుకున్నారు. 

….2006..బ్యాగ్‌పైపర్‌ విస్కీ, రోమనోవ్‌ వోడ్కాల తయారీ కంపెనీ హెర్బర్ట్‌సన్స్‌ను కొనుగోలు చేశారు. 

…2007.. ఎఫ్‌1 టీమ్‌ స్పైకర్‌ను కొనుగోలు చేసి.. ఫోర్స్‌ ఇండియాగా పేరు మార్చారు. ఎయిర్‌ డెక్కన్‌ను సొంతం చేసుకున్నారు. బ్రిటిష్‌ విస్కీ తయారీదారు వైట్‌ అండ్‌ మాకేను 595 మిలియన్‌ డాలర్లకు కొన్నారు. 

…2008.. ఐపీఎల్‌ టీమ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌ను 111.6 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్నారు. 

ప్రస్తుతం మాల్యాకు న్యూయార్క్‌ నగరంలోని ట్రంప్‌ టవర్స్‌లో; శాన్‌ఫ్రాన్సిస్కోల్లో విలాసవంతమైన ఇళ్లున్నాయి. గోవాలో ఓ విల్లా ఉంది. 200 విలాసవంతమైన కార్లు కూడా ఈయన సొంతం. హెలిపాడ్‌ సౌకర్యం ఉండే మెగా యాట్‌; గల్ఫ్‌స్ట్రీమ్‌ ప్రైవేట్‌ జెట్‌ కూడా మాల్యాకున్నాయి.

దివాలా తీయ‌డానికి ప్ర‌ధాన కార‌నాలు …..

2012.. వేతనాల చెల్లింపు చేయకపోవడంతో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది సమ్మెకు దిగారు. ఆదాయ పన్ను(ఐటీ) విభాగం సంస్థ ఖాతాలను స్తంభింపజేసింది. విమానాల సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్టోబరులో ప్రభుత్వం లైసెన్సును సైతం రద్దు చేసింది. యునైటెడ్‌ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి బ్రిటిష్‌ మద్య పానీయాల దిగ్గజం డియాజియో అంగీకరించింది.

2013.. యునైటెడ్‌ స్పిరిట్స్‌లో 27 శాతం వాటాను రూ.6500 కోట్లకు డియాజియో కొనుగోలు చేసింది. అయితే కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు అప్పులిచ్చిన బ్యాంకులకు ఎలాంటి నిధులూ అందలేదు.

2014.. యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్స్‌ను యునైటెడ్‌ బ్యాంక్‌ ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించింది.

2015.. ఛైర్మన్‌గా వైదొలగాలంటూ డియాజియో మాల్యాను కోరింది. అయితే అందుకు ఆయన అంగీకరించలేదు.

2016.. బకాయిల విషయంలో బ్యాంకులు రుణ రివకరీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. దీంతో డియాజియో నుంచి నిష్క్రమణ ఒప్పందం కింద మాల్యా పొందనున్న రూ.515 కోట్లను నిలిపివేయాలని పేర్కొంది.

త్వరలోనే మాల్యాను మనదేశానికి రప్పించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయమై భారత అధికారులు యూకే ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపాయి. కొద్ది రోజుల్లోనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) యూకేకు వెళ్లి ఇందుకు సంబంధించిన వ్యవహారాలను పూర్తి చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Related

  1. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గొప్పతనం.. వైఎస్ ఫ్యాన్సే కాదు.. టీడీపీ ఫ్యాన్స్ కూడా మొక్కడం ఖాయం
  2. సతీష్ రెడ్డికి ఇక మిగిలింది రాజకీయ సన్యాసమే
  3. అమీత్‌షా న‌గ‌ర ప‌ర్య‌ట‌న‌ తెర‌పైకి కేసీఆర్ ముస్లింరిజ‌ర్వేష‌న్ బిల్లు
  4. టీడీపీ రౌడీఇజం… ప్ర‌జాస్వామ్యానికి చెప్పుదెబ్బ‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -