Friday, May 3, 2024
- Advertisement -

అమీత్‌షా న‌గ‌ర ప‌ర్య‌ట‌న‌ తెర‌పైకి కేసీఆర్ ముస్లింరిజ‌ర్వేష‌న్ బిల్లు

- Advertisement -
Muslim Reservation Bill Passed In Telangana Assembly

తెలంగాణా సీఎం కేసీఆర్ హ‌డావుడిగా ముస్తిం రిజ‌ర్వేష‌న్ బిల్లును ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలుపెట్టి ఆమోదింప చేడంపై పెద్ద ప్లాన్‌లోనే ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌ధానంగా తెలంగాణాలో  బీజేపీకీ చెక్  పెట్టేందుకేన‌న్న వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ బిల్లుకు బీజేపీ వ్య‌తిరేకం  కాబ‌ట్టి   క‌మ‌లం పార్టీ  చెక్ పెట్టాలంటే ముస్లిం రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆయుధంగా చేసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. 

ద‌క్షిణాది రాష్ట్రాల‌పై గురిపెట్టిన క‌మ‌ల ద‌లం ప్రాధానంగా    తెలంగాణాలో బీజేపీనీ బ‌లోపేతం చేసేందుకు అదిష్ఠానం    ప్ర‌ణాలిక‌లు రూపొందింప‌స్తోంది . అందుకు త‌గ్గ‌ట్టుగానే  2019 సాధార‌న ఎన్నిక‌ల్లో  కనీసం 30 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలు గెలవాలని అమిత్‌షా టార్గెట్‌. బీజేపీకీ చెక్ పెట్టాలంటే  ముస్లిం రిజ‌ర్వేష‌న్ బిల్లు కూడా   కీసీఆర్ రాజ‌కీయ ఎత్తుగ‌డేన‌ని వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇక మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ల‌కు బీజేపీ వ్య‌తిరేకం కాబ‌ట్టి 2019 లో ఎన్నిక ల్లో కేసీఆర్ 12 శాతం రిజ‌ర్వేష‌న్ల ప్లాన్‌తో కొట్టాల‌ని కీసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది.

ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయన తెలిపారు రాస్ట్ర  క‌మ‌లం నాయ‌క‌త్వం స్ప‌ష్టం చేయ‌డంతో కీసీఆర్ మైనారిటీల బిల్లును తెర‌పైకి తీసుకొచ్చార‌నీ రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక‍్టర్‌ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.  మతం పేరుతో రిజర్వేషన్లు ఇవ‍్వడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ముస్లింలపై ఉన్న ప్రేమ కేసీఆర్‌కు ఇతర సామాజిక వర్గాలపై లేదని లక్ష్మణ్‌ దుయ్యబట్టారు.  

ముస్లింలలో పేదరికం లేదని తాము అనడం లేదని, అయితే ఓటు బ్యాంకు రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. 2019 సాధార‌న ఎన్నిక‌ల్లో మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ బిల్లుకు బీజేపీ వ్య‌తిరేకం కాబ‌ట్టి … మైనారిటీల ఒటు బ్యాంక్ చీల‌కుండ ఉండేందుకే  కేసీఆర్  ఈప్లాన్‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చార‌నీ రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. బిల్లును అసెంబ్లీలో పాస్ చేశాం దీనిపై నిర్ణ‌యంతీసుకోవాల్సింది కంద్రమేన‌ని  ఎన్నిక‌ల స‌మ‌యంలో దీన్ని బ‌లంగా తీసుకెల్తే … ఎలాగూ ముస్లింలు బీజేపీకీ వ్య‌తిరేకం కాబ‌ట్టి ఓట్లు ఎవ్వ‌రూ వేర‌ని …అదంతా టీఆర్ఎస్‌కే లాభిస్తుంద‌ని కేసీఆర్ ప్లాన్‌.

Related

  1. ర‌స‌వ‌త్త‌రంగా మారిన బెజ‌వాడ రాజ‌కీయాలు
  2. చిత్తూరు జిల్లాలో టీడీపీకీ మ‌రోషాక్‌… వైసీపీ వైపు ఎంపీ శివ‌ప్ర‌సాద్ చూపు
  3. ఏక్ష‌ణ‌మైనా యుధ్దం.. అంత‌ర్జాతీయంగా ఉద్రిక్త ప‌రిస్తితులు
  4. టీడీపీ రౌడీఇజం… ప్ర‌జాస్వామ్యానికి చెప్పుదెబ్బ‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -