Sunday, May 19, 2024
- Advertisement -

భారత సరిహద్దులు సరిగా లేని భార‌తీయ చిత్ర‌ప‌టాన్ని అమ్మ‌కానికి పెట్టిన అమేజాన్‌

- Advertisement -
Wrong Indian map, with part of J&K missing, sold on Amazon Canada! BJP leader slams website

కెన‌డాకు ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమేజాన్ మ‌రో సారి దుస్సాహ‌సానికి ఒడి గ‌ట్టింది. భారత జాతీయ జెండా నమూనాలో డోర్‌మ్యాట్‌లు విక్రయించి మన దేశాన్ని అవమానించిన అమెజాన్ త‌న వ‌క్క‌బుధ్దిని మార్చుకోలేదు.

ఇప్పుడు ఏకంగా కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు లేకుండా భార‌త్ చిత్ర‌ప‌టాన్ని నెట్‌లో అమ్మ‌కానికి పెట్టింది. భాజపా దిల్లీ ప్రతినిధి తజిందర్‌ పాల్‌ ఎస్‌ బగ్గా ఈ పోస్టును గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
డీఐవైథింకర్‌ అనే సంస్థ డెకరేషన్‌ వాల్‌ స్టిక్కర్‌ కింద భారత చిత్రపటాన్ని ‘అమెజాన్‌ కెనడా’ సైట్లో అమ్మకానికి పెట్టింది. ఇందులో భారత సరిహద్దులు సరిగా లేవు. జమ్ము-కశ్మీర్‌‌లోని సగం ప్రాంతాలను భారత మ్యాప్‌ నుంచి తీసేశారు.ఈ యాడ్‌ను ఇటీవల గుర్తించిన తజీందర్‌ ట్విటర్లో పోస్టు చేశారు. ‘దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. ఈ చిత్రపటాన్ని అమెజాన్‌ కెనడా తన సైట్‌ నుంచి తొలగించాలి. వెంటనే అమ్మకాలు నిలిపివేయాలి’ అని ట్విటర్‌ ద్వారా హెచ్చరించారు.
అమెజాన్‌ కెనడా ఇలాంటి చర్యలకు పాల్పడటం కొత్తేమి కాదు. ఇలా చాలాసార్లు ఇలా త‌ప్పులు చేసి సారీ చెప్పింది. ఈ ఏడాది జనవరిలో మన త్రివర్ణ పతాకం లాంటి డోర్‌మ్యాట్‌లను విక్రయించడం వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ అమెజాన్‌పై మండిపడ్డారు. డోర్‌మ్యాట్‌ విక్రయాలను నిలిపివేసి, తమ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -