Tuesday, May 14, 2024
- Advertisement -

ఏపీలో మందుబాబుల‌కు కొత్త క‌ష్టాలు ..

- Advertisement -

అంచెల వారీగా మ‌ద్య‌పాన‌నిషేధం అమ‌లు చేస్తామ‌ని పాద‌యాత్ర‌లో ప్ర‌క‌టించిన జ‌గ‌న్ ఆదిశ‌గా ఇప్ప‌టికే అడుగులు వేశారు. బెల్ట్ షాపుల‌ను ర‌ద్దు చేశారు. ప్రస్తుతం మద్యం అమ్మకాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ సమయాన్ని కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలని భావిస్తోంది. మద్యం కొత్త పాల‌సి అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయాల‌నె ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదే జ‌రిగితె మ‌ద్యం అమ్మ‌కాలు ప‌డిపోతాయి.

వాస్తవానికి సాయంత్రం 6 గంటల తర్వాతే మద్యం అమ్మకాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఎవరైనా సరే… రాత్రి వేళల్లోనే ఎక్కువగా మద్యం తాగుతారు. రాత్రి పూట మద్యం షాపులు కిక్కిరిసిపోతాయి. ఇదే రూల్‌ను అమ‌లు చేస్తె భ‌రాస్థాయిలో మ‌ద్యం అమ్మ‌కాలు ద‌గ్గిపోతాయి. త్వ‌ర‌లోనె దీనిపై అధ్య‌య‌నం చేయ‌నున్నారు అధికారులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -