Sunday, May 19, 2024
- Advertisement -

తొలి జీవోను జారీ చేసిన వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం…

- Advertisement -

న‌వ్యాంధ్ర సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నె జ‌గ‌న్ ప‌రిపాల‌న‌మీద దృస్టిసారించారు. న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌లో భాగంగా ముంద‌డుగువేశారు. వైఎస్ జగన్ సర్కారు ఈ ఉదయం తన తొలి జీవోను జారీ చేసింది. నిన్న ప్రమాణ స్వీకారోత్సవం తరువాత వయోవృద్ధులకు ఇస్తున్న పెన్షన్ ను రూ. 2 వేల నుంచి రూ. 2,250కి పెంచుతున్నట్టు జగన్ ప్రకటించి, తన తొలి సంతకాన్ని ఆ ఫైల్ పై పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ అని పేరు పెట్టగా, దీనిపై చీఫ్ సెక్రెటరీ జీవోను విడుదల చేశారు.

వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలతో పాటు వయోవృద్ధుల పెన్షన్ వయసును 65 నుంచి 60కి కుదిస్తున్నట్టు జీవోలో పొందు పరిచారు. జూలై 1 నుంచి కొత్త పెన్షన్ పథకం అమలవుతుందని ఇందులో పేర్కొన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -