Saturday, May 18, 2024
- Advertisement -

ఏదో ఒకటి చెప్పండి

- Advertisement -

కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై… ఏడాదిన్నరగా నానుస్తున్న మోడీ సర్కార్ తో పాటు… ఏపీ అధికార పార్టీ టీడీపీ తీరునూ విమర్శించేందుకు వైసీపీ సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి.. అంటే.. గురువారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి.

వాటి వేదికగానే… బీజేపీ, టీడీపీలను టార్గెట్ చేసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.పార్టీలకు అతీతంగా… అంతా కోరుతున్న ప్రత్యేక హోదా డిమాండ్ పై.. కేంద్రం కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటోంది. విషయాన్ని నీతి ఆయోగ్ (ప్రణాళిక సంఘం స్థానంలో మోడీ సర్కార్ ఏర్పాటు చేసిన కమిషన్) కు సిఫారసు చేశామని.. నిర్ణయం నీతి ఆయోగ్ కోర్టులోనే ఉందని కేంద్రం చెబుతోంది.

కొత్త రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన రోజు కూడా ప్రధాని… ప్రత్యేక హోదాపై మాట కూడా మాట్లాడలేదు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న రాష్ట్ర నాయకులు.. టీడీపీ సీనియర్లు.. అశోక గజపతి రాజు.. సుజనా చౌదరి కూడా కొన్నాళ్లుగా ఏం మాట్లాడడం లేదు. ఏపీకి అన్నీ చేస్తున్నామని చెప్పుకొచ్చే మరో మంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రత్యేకంపై ఏదీ క్లియర్ గా చెప్పడం లేదు.

ఇలాంటి అన్ని విషయాలను పార్లమెంట్ లో ప్రస్తావించేందుకు వైసీపీ ఎంపీలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తమ పోరాటంతో.. ఏదో ఒక ప్రకటన వచ్చేలా చేసి జనంలో కాస్త క్రేజ్ కూడా పెంచుకోవాలని జగన్ క్యాంప్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. వైసీపీ ఎంపీలు.. పార్లమెంట్ వింటర్ సెషన్స్ లో ఆందోళనకు దిగితే… ప్రత్యేక హోదా విషయంపై కాంగ్రెస్ ఎంపీలు కూడా జత కలిసే అవకాశం ఉంది.

తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని… టీడీపీ, బీజేపీ ఎంపీలు కూడా గమనిస్తున్నట్టు పొలిటికల్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వైసీపీ, కాంగ్రెస్ ఆందోళనకు తగ్గట్టుగా ఎదురుదాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఇదంతా నిజమైతే… ఏపీకి ప్రత్యేక హోదా విషయం.. పార్లమెంట్ సమావేశాల్లో వేడి పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -