Monday, May 20, 2024
- Advertisement -

తెలంగాణ ప్ర‌భుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి వైఎస్ షర్మిల

- Advertisement -

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానని ప్రజలకు హామీ ఇస్తూ వచ్చారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల. ఖమ్మం భారీ బహిరంగ సభలో తర్వరలో జండా,అజెండా ప్రకటిస్తానని అన్నారు. ఆ మద్య తెలంగాణలో నిరుద్యోగులు దీనావస్థలో ఉన్నారని.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. సమయం చిక్కినప్పుడల్లా తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు షర్మిల.

తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వంపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు వైఎస్ ష‌ర్మిల‌. రాష్ట్రంలో అన్న‌దాత‌లు రోడెక్కుతున్నార‌ని.. ప్రభుత్వ చోద్యం చూస్తుందని ష‌ర్మిలా అన్నారు. అన్న‌దాత‌లు రోడ్డెక్కుతున్నార‌ని ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతలు అమ్ముకునే సమయంలో నానా కష్టాలు పడుతున్నానని.. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సింది పోయి కష్టాలు పడుతంటే వేడుక చూస్తున్నారని ఆరోపించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు ఆలస్యంగా కొంటున్నారని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. ‘విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి..న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడెక్కాలి.. కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల తరబడి పంట కొనుగోలు కేంద్రాల్లో.. వడ్లు వర్షం పాలైతున్నయి అని మొత్తుకుంటున్నా..మీకు రైతు గోస కనుపడదు.. వినపడదు..’ అంటూ ట్విట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -