Wednesday, May 15, 2024
- Advertisement -

మోఢీ-బాబు మీట్…. చంద్రబాబుకు దిమ్మతిరిగే స్థాయి లా పాయింట్ లేవనెత్తిన వైసిపి

- Advertisement -

బిజెపితో కలిసి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకుంటున్న చంద్రబాబుకు చాలా నెలల తర్వాత……చాలా సార్లు దేబిరిస్తూ ప్రాధేయపడిన తర్వాత కలవడానికి అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత నుంచీ పచ్చ బ్యాచ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అయితే మోడీని కలిసి బయటికి వచ్చాక బాబు మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు కామెడీ అయిపోతున్నాయి. నెటిజనులు కూడా సెటైర్స్ వేస్తున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలను విశ్లేషిస్తూ వైకాపా నేత, లాయర్ అంబటి రాంబాబు తీసిన లా పాయింట్లకు ఇప్పుడు టిడిపి సీనియర్ నేతలు కూడా నీళ్ళు నములుతున్న పరిస్థితి.

మోడీని కలిసి బయటికి వచ్చిన బాబు……….ఎపికి ఇచ్చిన హామీలు మోడీ నెరవేరుస్తాడన్న నమ్మకం ఉంది అని చెప్పాడు. అయితే మీడియా వాళ్ళు మాత్రం……మూడున్నరేళ్ళ నుంచీ ఇదే మాట చెప్తున్నారు…….ఇకపై ఎన్నికలు వచ్చేవరకూ కూడా ఇదే మాట చెప్తారా అని సెటైరికల్‌గా అడిగారు. ఆ కౌంటర్‌తో ఫీలయిన చంద్రబాబు……హామీలు నెరవేర్చకపోతే కోర్టులో కేసులు వేస్తాం అని మాట్లాడారు. మామూలుగా అయితే హామీలు నెరవేర్చకపోతే పొత్తు తెగదెంపులే అని శివసేన లాంటి హార్డ్ కోర్ హిందూ పార్టీ కూడా మోడీని బెదిరిస్తూ ఉంటుంది. కానీ బాబుగారు మాత్రం ఆ మాట చెప్పలేరు. అంతా కూడా ఓటుకు నోటు మహిమ.

ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు కోర్టుకు వెళతాననడంపై ఇప్పుడు అంబటి రాంబాబు సూపర్ లాజిక్ తీశాడు. కోర్టులో చంద్రబాబు ఏ ప్రభుత్వంపై కేసు వేస్తాడు? మోడీ ప్రభుత్వంపైన……ఆ మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు పార్టీ కూడా భాగస్వామినే. అంటే కోర్టులో ఏమని కేసు వేస్తాడు? ఏమని వాదిస్తాడు? నా పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం నా రాష్ట్రాన్ని మోసం చేస్తోంది అందుకే కేసు వేశా అంటాడా?

మామూలు జనాలకు కూడా ఫూలిష్‌గా అనిపించే ఇలాంటి ఐడియాలు….ప్రపంచానికి పాఠాలు చెప్పాను అని చెప్పుకుతిరిగే చంద్రబాబుకు మాత్రం మాగొప్పగా అనిపిస్తూ ఉంటాయి. దటీజ్ చంద్రబాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -