Sunday, May 5, 2024
- Advertisement -

క‌ర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఆ మూడు ప‌ద్ధతుల‌తో చంద్ర‌బాబు…

- Advertisement -
  • ఎంతిద్దాం.. ఏమిద్దాం.. విన‌కుంటే ఏం చేద్దాం

కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీని బ‌ల‌హీన‌ప‌ర్చ‌డంలో చంద్ర‌బాబు ముందంజ‌లో ఉన్నారు. అందులో భాగంగా ఇద్ద‌రు ఎంపీలు టీడీపీలోకి వెళ్లిపోయారు. ఎంచ‌క్కా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల‌ను సైకిల్ ఎక్కించుకొని స‌వారీ చేస్తున్నాడు. 2014 ఎన్నిక‌ల్లో క‌ర్నూల్ జిల్లాలోని 14 ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 11 గెలవ‌డంతో రెండు ఎంపీ సీట్లు సాధించింది. అయితే కాల‌క్ర‌మంలో ఇద్ద‌రు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక భూమా ఫ్యామిలీ సైకిల్ ప‌క్షం చేరింది. ప్ర‌ధాన కుటుంబాల‌న్నీ టీడీపీ వైపు మ‌ళ్లాయి. ఈ స‌మ‌యంలో భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి మ‌ర‌ణాలు వైఎస్సార్‌సీపీకి ప్ర‌ధాన లోటు ఏర్ప‌డింది. దీంతో క‌ర్నూల్ జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ తిర‌గ‌డం లేదు.

తాజాగా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పొందడంతో వైఎస్సార్‌సీపీ డీలా ప‌డిపోయింది. పైగా ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చ‌క్ర‌పాణితో ఓవ‌రాక్ష‌న్ చేసి రాజీనామా చేయ‌డంతో స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక డేట్ వ‌చ్చింది. ఇప్పుడా ఎన్నిక రావ‌డంతో వైసీపీ పునారాలోచ‌న‌లో ప‌డింది. అస‌లు ఎన్నిక‌లో పోటీ చేద్దామా వ‌ద్దా అని ఆలోచిస్తున్నారు. నంద్యాల‌లో గెలుస్తామ‌నే ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో అధికార పార్టీపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ క‌ర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీపై సంధిగ్ధ‌త ఏర్ప‌డింది.

అయితే అధికార ప‌క్షం మాత్రం ఈ ఎన్నిక‌లో కూడా త‌మ‌దే విజ‌య‌మ‌ని ధీమాగా ఉంది. స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కొనేందుకు రెడీగా ఉంది. ఎందుకంటే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరేట‌ప్పుడు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కూడా తీసుకెళ్లాడు. పెద్ద ఎత్తున ఆ పార్టీలోకి చేర‌డంతో ఇప్పుడు చంద్ర‌బాబు వారంద‌రినీ టీడీపీ వైపు మ‌ళ్లించుకునేందుకు ఇప్ప‌టి నుంచే ఏర్పాట్లు చేస్తున్నాడు. అధికార ప‌క్షం కాబ‌ట్టి న‌యానో.. భ‌యానో త‌మ వంక చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఎవ‌రికేమి ఇద్దాం.. ఎంతిద్దాం.. విన‌క‌పోతే ఏం చేద్దాం అనే మూడు ప‌ద్ధ‌తులు న‌మ్మాడు. దానిపై న‌మ్మ‌కంతో ఈ ఎమ్మెల్సీ సీటును సైకిల్‌పైకి ఎక్కించుకునేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నిక త‌మ‌దేన‌ని ధీమాతో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఉన్నారు.

డిసెంబ‌ర్ 19వ తేదీన ఎన్నిక నోటిఫికేషన్
26వ తేదీన నామినేషన్ల స్వీకరణ
29వ తేదీన ఉపసంహరణ
జనవరి 12వ తేదీ పోలింగ్
16వ తేదీన ఎన్నికల ఫలితాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -