Sunday, May 19, 2024
- Advertisement -

మాట త‌ప్ప‌డంలో తండ్రిని మించిపోయారు లోకేష్….

- Advertisement -

ఐటీ మంత్రి లోకేష్ వాక్ చాతుర్యం గురించి ఎంత చెప్పుకున్నా వేస్టే. అసలే చినబాబు మాటల మీద చాలామందికి చాలానే సందేహాలు ఉన్నాయి. రాజకీయాలకు కొత్త కాకున్నా.. మంత్రిగా బాధ్యతలు చేపట్టి కొత్త అయిన నేపథ్యంలో మాటల్లో ఆ మాత్రం తడబాటు మామూలే.

మంత్రి అయ్యాక కేవలం 90 రోజుల్లోనే 3 వేల ఉద్యోగాల్ని ఐటీ రంగంలో తీసుకొచ్చా న‌ని సెల‌విచ్చారునారా లోకేష్‌. ఎమ్మెల్యేగా గెలిచే ధైర్యం లేక, ఎమ్మెల్సీగా నామినేటెడ్‌ పదవి తెచ్చుకుని.. మంత్రి అయినట్టుండదు ఉద్యోగాల వ్యవహారం.
ప్రజల్లోకి వెళ్ళి నాయకుడిగా నిరూపించుకుని, ప్రజామోదంతో ప్రజా ప్రతినిథి అయితే కదా.. ఉద్యోగమంటే ఏంటో తెలిసొచ్చేది. అందుకే, ఒక్కోసారి లక్ష అంటారు, ఇంకోసారి రెండు లక్షలంటారు.. నోటికి ఎంతొస్తే అంతే.ఎవ‌రూ ప్ర‌శ్నించ‌ర‌నే ధైర్యం.గ‌తంలో 2019 నాటికి ఐటీ రంగంలో రెండు లక్షల ఉద్యోగాల్ని కల్పించి తీరతామన్నారు.. ఇప్పుడేమో, 2019 నాటికి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాల్ని కల్పిస్తామంటున్నారు.అంటె లెక్క ల‌క్ష‌కు త‌గ్గింది.
విజయవాడ కేంద్రంగా నారా లోకేష్‌ ఇప్పటికే పలు ఐటీ సంస్థల్ని ప్రారంభించారు మంత్రి హోదాలో.ఆమాత్రం ప‌బ్లిసిటీ లేకుంటె ఎట్లా.ఇప్పుడు ల‌క్ష ఉద్యోగాల‌న్నారు….కొన్ని రోజులు పోతే కాస్త ల‌క్ష ఏ పది వేల దగ్గరో ఫిక్స్‌ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వర్ధంతికీ, జయంతికీ తేడా తెలియదు సరే.. ఒక లక్షకీ, రెండు లక్షలకీ తేడా తెలియకపోతే ఎలా మంత్రిగారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -