Sunday, May 19, 2024
- Advertisement -

వైకాపాలోకి టిడిపి అత్తిలి మాజీ ఎమ్మెల్యే….. గంటా, లోకేష్‌కి షాక్

- Advertisement -

చంద్రబాబు సూచనలతో నారా లోకేష్ వీర ప్రయత్నాలు చేశారు. ఆర్థిక, అంగ బలం గట్టిగా ఉన్న గంటాను కూడా తన ప్రయత్నాల్లో భాగం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి జిల్లాల్లో వైకాపా బలపడకూడదు…… ఆ పార్టీలోకి చేరికలు ఉండకూడదు అని నానా పాట్లూ పడ్డారు. కానీ టిడిపి నాయకులు ఎంతలా ప్రయత్నాలు చేస్తుంటే వైకాపాలోకి అంతలా చేరికలు పెరుగుతూ ఉండడం విశ్లేషకులను ఆశ్ఛర్యపరుస్తోంది. 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపి సీటుతో సహా అన్ని సీట్లూ మనవే అని ధర్మ దీక్ష సందర్భంగా చంద్రబాబు ప్రగల్భాలు పలికిన రెండు రోజుల్లోనే విశాఖలో ఉన్న బడా బిజినెస్ మేనే ఎంవిబి బిల్డర్స్ అధినేత సత్యనారాయణ, ఇతర పార్టీల నేతలు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.

ఇప్పుడిక గోదావరి జిల్లాల్లో బలమైన నాయకుడు, టిడిపి మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు వైకాపాలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఈ నెల 27న జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్నట్టు వెల్లడించాడు. పశ్ఛిమగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అథ్యక్షుడు అయిన శ్రీరంగనాథరాజు వైకాపాలో చేరకుండా అడ్డుకోవాలని లోకేష్, గంటా శ్రీనివాసరావులు ప్రయత్నాలు చేశారు కానీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో సహా అందరూ కూడా వైకాపాకు జైకొట్టడంతో ఏమీ చేయలేకపోయారు. 2014 ఎన్నికల్లో స్వీప్ చేసిన జిల్లాలోని నాయకులే ఇప్పుడు వైకాపా బాట పడుతుండడం మాత్రం టిడిపిని కలవరపరిచేదే. అధికారంలో ఉన్న టిడిపిని వదిలి అధికారం లేని వైకాపాలో చేరుతున్నారంటేనే 2019 ఎన్నికల్లో వైకాపా గెలుపుపై ఆయా నాయకులకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో ఇట్టే తెలిసిపోతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -