Thursday, May 2, 2024
- Advertisement -

ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖనే.. రాజధాని !

- Advertisement -

ఏపీలో మూడు రాజధానుల అంశం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ పై ఇతర పార్టీలనుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఓ వైపు మూడు రాజధానుల విషయంలో కోర్టు నుంచి అడ్డంకులు ఉన్నప్పటికి, జగన్ సర్కార్ మరో విధంగా వ్యూహాన్ని అమలు చేస్తోంది. ముందుగా విశాఖా కేంద్రంగా పరిపాలన సాగిస్తూ.. మెల్లగా మూడు రాజధానులను అమలు చేయాలను చూస్తోంది జగన్ సర్కార్. ఇక విశాఖాను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు ఉత్తరంద్ర ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు వైసీపీ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది.

అందులో భాగంగానే ఈ నెల 15న జరిగిన విశాఖ గర్జనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కచ్చితంగా విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని ఘంటాపథంగా విశాఖ గర్జనలో చెప్పుకొచ్చారు వైసీపీ నేతలు. ఇక మరోసారి ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు అధికార పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం పరిపాలనను వికేంద్రీకరణ చేయడం ఖాయమని చెప్పుకొచ్చారు. త్వరలోనే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రారంభిస్తామని, ఇది ఉత్తరాంధ్రుల దశబ్ధాల కల అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. విశాఖాను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయడంలో కొద్దిగా ఆలస్యం అవుతున్నప్పటికి, కచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక ఏపీకి అమరవతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దాంతో మూడు రాజధానులపై హైకోర్టు స్టే విధించింది. అయితే త్వరలోనే కోర్టు అడ్డంకులను అధిగమిస్తామని సజ్జల చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

నువ్వు నేర్పిన విద్యే.. జగన్ కు జనసేన కౌంటర్ !

ఏపీలో ముందస్తు ఎన్నికలు.. రఘురామ కన్ఫర్మ్ !

వామ్మో : ఎన్నికల ఖర్చు..: 5000 కోట్లు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -