Saturday, May 18, 2024
- Advertisement -

దుష్టశక్తుల ఒత్తిడి వళ్ళే భూమానాగిరెడ్డి మరణం: అఖిలప్రియ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

భూమా అఖిలప్రియలో ఆవేశం పాళ్ళు ఎక్కువే. తాజాగా మరోసారి భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు అఖిలప్రియ. అసలే 2019 ఎన్నికలు ఏడాదిలోనే ఉన్న నేపథ్యంలో నాయకులందరి మాటలు కూడా ఇప్పుడు స్కానింగ్‌కి గురవుతున్న పరిస్థితి. పార్టీ అధినేతలు ప్రతి ఒక్కరి మాటలు, చేతలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఫిరాయింపులు, జంపింగ్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళిన చంద్రబాబు కూడా 2019 ఎన్నికల్లో నమ్మకస్తులకే టికెట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. జగన్ కూడా ఈ సారి జాగ్రత్తపడతాడనడంలో సందేహం లేదు. అసలే వైకాపా నుంచి టిడిపిలోకి జంప్ చేసిన ఎస్వీ మోహన్‌రెడ్డి మళ్ళీ వైకాపాలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియ స్టేట్‌మెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

దుష్టశక్తుల ఒత్తిడి వళ్ళే భూమానాగిరెడ్డి మరణించారన్నది భూమా అఖిలప్రియ మాట. చనిపోయే ముందు వరకూ భూమానాగిరెడ్డిని చాలా ఇబ్బందులు పెట్టారని అఖిలప్రియ ఆవేశంగా స్పందించింది. అధికారంలో లేని జగన్‌కి భూమా నాగిరెడ్డిని ఇబ్బందిపెట్టేంత సత్తా లేదు. వైకాపా నుంచి టిడిపిలోకి జంప్ అయిన తర్వాత భూమా నాగిరెడ్డి గురించి జగన్ పెద్దగా స్పందించింది కూడా లేదు. ఆవేదన వ్యక్తం చేసి సైలైంట్ అయ్యాడు. ఇక భూమాపై చంద్రబాబు ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చాడు అన్న విషయం మాత్రం మీడియాలో చర్చనీయాంశం అయింది. పార్టీలో చేరక ముందు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టాడు. చంద్రబాబు ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టాడో భూమానే స్వయంగా చెప్పాడు. ఆ ఇబ్బందులు, బాధలు పడే ఓపిక లేకే పార్టీ మారుతున్నానని చెప్పాడు. ఇక భూమా కుటుంబానికి ప్రత్యర్థులైన శిల్పా కుటుంబ సభ్యులను గెలిపించాలని భూమానాగిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చాడని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. అది కూడా భూమా చనిపోక రెండు మూడు రోజుల ముందే ఈ హెచ్చరికల వ్యవహారాలు నడిచాయి. ముందు రోజు కూడా చంద్రబాబుతో మీట్ అయ్యాడు భూమా. అలాగే శిల్పాను గెలిపిస్తేనే మంత్రి పదవి అని కూడా చెప్పాడు చంద్రబాబు. పార్టీలో చేరిన వెంటనే మంత్రి పదవి ఇస్తానన్న బాబు…..భూమా చనిపోయేవరకూ కూడా పట్టించుకోలేదు అని భూమా వర్గీయులే మీడియా ముందు వాపోయారు. ఈ నేపథ్యంలో దుష్టశక్తుల ఒత్తిడి వళ్ళే భూమానాగిరెడ్డి చనిపోయారన్న భూమా అఖిలప్రియ మాటలు మాత్రం సంచలనం అవుతున్నాయి. ఈ విషయంపై టిడిపి జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -