- Advertisement -

ఫారెస్ట్ అధికారులపై దాడి..పవన్‌కు షాక్!

- Advertisement -

ఫారెస్ట్ అధికారులపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే దాడి కేసులో బిగ్ ట్విస్ట్. శ్రీశైలం జనసేన ఇంచార్జ్ అశోక్ రౌత్‌ని A1 నిందితుడిగా చేర్చారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్‌లో దాడి చేస్తూ కనిపించిన టీడీపీ ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్ రెడ్డిని A2గా చేర్చారు పోలీసులు.

కేసులో జనసేన నేతను చేర్చడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు అధికారులు, అసోసియేషన్ నాయకులు. ఇద్దరి పైన బెయిలబుల్ కేసులే పెట్టారు పోలీసులు.

ఫారెస్ట్ అధికారులపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్ రెడ్డి దాడి ఘటనపై విచారణకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పూర్తి నివేదికను అందించి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులను కొట్టారు శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే. రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని చెక్ పోస్ట్ వద్దే డ్రైవర్ పై దాడి చేశారు ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్ రెడ్డి. ట్రైబల్ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని.. రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని హెచ్చరిక జారీ చేశారు.
మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్బాషలాడారు. ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం లాక్కుని.. వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని శ్రీశైలం అంతటా తిప్పారు.

అనంతరం తన గెస్ట్ హౌస్‌కి తీసుకువెళ్లి అనుచరులతో కలసి సిబ్బందిపై దాడి చేశారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే, తాము ఎలా విధులు నిర్వహించాలని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేయడమే కాదు సీసీటీవీ ఫుటేజ్ విడుద‌ల చేశారు అధికారులు. ఫారెస్ట్ అధికారులు రామానాయక్, గురవయ్య, మోహన్ కుమార్, కరీముల్లాలపై దాడి జరుగగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఏపీ జూనియర్‌ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -