Thursday, May 16, 2024
- Advertisement -

బాబు, రేవంత్‌కు చిప్ప‌కూడు త‌ప్ప‌దా…?

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌లు ఏపీ సీఎం చంద్ర‌బాబ నాయుడికి తీవ్ర నిరాశ‌ను మిగిల్చాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో బాబులో వ‌ణుకు మొద‌ల‌య్యింది. ఒక వేల కూట‌మి అధికారంలోకి వ‌చ్చింటే ప‌రిస్థితి వేరే విధంగా ఉండేది. కాని కూట‌మి చిత్తుగా ఓడింది. ఒక వైపు ఏపీలో సార్ర‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యం…మ‌రో వైపు ఓటుకు నోటు కేసు భ‌యం బాబును వెంటాడుతోంది.

తెలంగాణా ఎన్నిక‌ల‌ల్లో కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని భాగీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. సీట్ల పంప‌కాల‌నుంచి ఎన్నిక‌ల ఖ‌ర్చు అంతా తానై న‌డిపించారు బాబు. అధికారంలోకి వ‌చ్చిఉంటే బాబు చ‌క్రంతిప్పేటోడు. దాంతో ఓటుకు నోటుకేసునుంచి భ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని పెట్టుకున్న ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ఎప్ప‌టికైనా ఓటుకు నోటు కేసు బాబు మెడ‌కు చుట్టుకోక‌త‌ప్ప‌దు. ఆ కేసు ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో తెలియదు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ లతో పాటు సండ్ర వెంకటవీరయ్య కూడా నిందితుడే. వ్యూహాత్మ‌కంగానే రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి బాబు పంపించాడ‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో రేవంత్ కేసీఆర్‌పై దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో ఇక ఆయన తీరు ఎలా మారుతుందో చూడాలి. కొడంగల్ లో ఓడితే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరిన రేవంత్ దాన్ని చెత్త‌బుట్ట‌లో ప‌డేసిన సంగ‌తి తెలిసిందే.

ఓటుకు నోటు కేసులో ఈ ముగ్గురు నాయకుల‌లో సండ్ర ఇప్పుడు గులాబీ గూటికి చేరడం ఈ ముగ్గురికీ ప్రమాద ఘంటిక‌లు మోగాయ‌నుకోవాలి. గులాబీ పార్టీలోకి వచ్చిన తర్వాత.. సండ్రకు ఏదైనా పెద్దపదవి దక్కినా.. అందలం ఎక్కించినా.. దానికి మించిన స్కెచ్ ఏదో వారి మదిలో ఉన్నదని అనుకోవాలి.

ఇప్పుడు ఓటుకు నోటు కేసును తిరగతోడడం అంటూ జరిగితే.. గులాబీ గూటికి చేరిన.. సండ్ర ఆ గూటి పలుకులే పలుకుతుందనడంలో సందేహంలేదు. ఆయన అటువైపు మాట్లాడితే చంద్రబాబుకు, రేవంత్ కు చిప్ప కూడు తప్పదు. అసలే చంద్రబాబు ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా ఒక సాక్ష్యంగా ఇప్పటికే ఉంది.

ఓటు నోటు కేసు గుదిబండగా మారి మెడకు చుట్టుకుంటుందని చంద్రబాబు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. మ‌రో వైపు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణ వేసిన పిటిష‌న్‌ను ఫిభ్ర‌విరిలో విచారిస్తామ‌ని ఇప్ప‌టికే సుప్రీంకోర్టు తెలిపింది. అదే స‌మ‌యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌ధ్యంలో బాబు చిక్కులు త‌ప్ప‌వు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -