Thursday, May 16, 2024
- Advertisement -

అడిగితే తంతా స్టైల్‌లో తోలుతీస్తా, ఖబడ్దార్ అనడమేంటి బాబుగోరు?

- Advertisement -

ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ నీతులు చెప్పే అర్హత నాకు ఉంది అన్నది చంద్రబాబు ఫీలింగ్. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే ఎలాంటి తిండి తినాలి? పిల్లలను ఎలా పెంచాలి? ఎలా నీతిగా బ్రతకాలి? లాంటి అన్ని విషయాల్లోనూ బాబుగోరు చెప్పే నీతి సూత్రాలనే ఫాలో అవ్వాలన్నది బాబుతో పాటు పచ్చ బ్యాచ్ సిద్ధాంతం. మరి అలాంటి ఉన్నతోన్నత సలహాలు జనాలు పాటించాలంటే….ఆ సలహాలు ఇచ్చే వ్యక్తి ఎంత సుద్ధుడు అయి ఉండాలి. ఓటుకు కోట్లు కేసులో ‘బ్రీఫ్డ్ మీ’ అంటూ ఆడియో, వీడియో సాక్ష్యాలతో అడ్డంగా దొరికేసిన నాయకుడి నీతికబుర్లకు, అవినీతి వ్యతిరేక మాటలకు ఉండే విలువ ఎంత? ఆ విషయం పక్కనపెడితే నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా జగన్ మాట్లాడిన మాటలకు ఆరున్నొక్క రాగంలో అరిచి గోలచేసి జగన్‌ని చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్‌గా, హింసావాదిగా ప్రజలను నమ్మించడంలో సక్సెస్ అయిన బాబు అండ్ ఆయన భజన బృందానికి ఇప్పుడు బాబుగారు మాట్లాడిన మాటలు ఒకేనా? ఆ మాటల్లో సభ్యత, సంస్కారం ఉట్టిపడుతోందా?

‘ఏయ్..’ అని ఒక ఎంపిని సంభోదించిన బాబుగోరు ….ఇప్పుడిక ‘ఎస్టీల్లో చేరుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చావ్ కదా…. ఎప్పుడు చేరుస్తారు’ అని అడిగిన పాపానికి మత్య్సకారులను…….‘తోలు తీస్తా….ఖబడ్దార్’ అంటూ బెదిరించాడు. ఇచ్చిన హామీని నెరవేర్చండి బాబయ్యా అని అడగితేనే ఓటేసిన ప్రజల తోలు తేసేస్తాడా బాబు అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు రేగుతున్నాయి. యదావిధిగా బాబు భజన బృందం మొత్తానికీ కూడా బాబుగారి మాటలు కడు కమ్మగా వినిపిస్తున్నాయి కానీ మత్య్సకారులు మాత్రం రగిలిపోతున్నారు. ఇక ఇదే సందర్భంలో ఇప్పుడు మీ ఎమ్మెల్యేకు కూడా అయింది. ఎవ్వరినీ వదిలిపెట్టాను. ఆందోళనలు, నిరసన తెలపడాలు లాంటి వాటితో రోడ్డెక్కితే తోలు తీస్తా అంటూ బాబుగారు మాట్లాడిన మాటలు అయితే బాబు మనస్థితిపైన అనుమానాలు తెప్పించేలా ఉన్నాయి. నెటిజనులతో పాటు ఆలోచనాపరులు కూడా బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రతిపక్షనేత జగన్‌తో పాటు ఎంపిలను, ఎమ్మెల్యేలను దూషించడం వరకే పరిమితమైన చంద్రబాబు…..ఇప్పుడు ఓటేసిన ప్రజలతోనే తోలుతీస్తా …..ఖబడ్దార్ అని అనడం మాత్రం జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశం అవుతోంది. బాలయ్య బాబు చెంపదెబ్బకొడితే దాన్ని ప్రేమ అనుకోవాలని బాబు బ్యాచ్ సూత్రీకరించినట్టుగా……..చంద్రబాబు తోలు తీస్తా అంటే అది ఇంకా ఎక్కువ ప్రేమ అన్నట్టు భజనమీడియాతో పాటు బాబు బ్యాచ్ అంతా సమర్థించుకుంటారేమో తెలియదు కానీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కూడా ఆంధ్రప్రదేశ్ అభిృద్ధి విషయం బాబు అనుభవం ఎక్కడా కనిపించడం లేదు కానీ అహంకారం, నియంతృత్వం, మాట దురుసుతనం మాత్రం చాలా గట్టిగానే కనిపిస్తోందని విశ్లేషకులు కూడా ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. సంస్కారం మరిచిపోయి మరీ తిట్లకులేసే చంద్రబాబుకు అసలు నీతులు చెప్పే అర్హత ఉందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -