Tuesday, May 14, 2024
- Advertisement -

చిత్తూరులో టీడీపీకీ బిగ్ షాక్.. మరో బిగ్ వికెట్ డౌన్

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు దూకుడు పెంచింది బీజేపీ. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ప్రధానంగా టీడీపీలో ఉన్న బలమైన నాయకులపై ఫోకస్ పెట్టింది.సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్మకున్నాయి. మరో వైపు లోకేష్ నాయకత్వంపై కూడా పార్టీలో ఉన్న నాయకులకు నమ్మకం లేకపోవడంతో వారంతా భాజాపా వైపు చూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది టీడీపీ నేతలు కమలం గూటికి చేరారు. తాజాగా మరో సీనియర్ నేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. దీంతో బాబుకు బిగ్ షాక్ తగిలింది.

పార్టీ సీనియర్ నేత,బాబుకు అత్యంత సన్నిహితుడు,సివిల్ సప్లై కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన సైకం జయచంద్రారెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు జయచంద్రారెడ్డితో పాటూ పలువురు టీడీపీ ముఖ్య నేతలు, అనుచరులు కూడా బీజేపీలో చేరారు.

కడప జిల్లాకు చెందిన సైకం జయచంద్రారెడ్డి తిరుపతిలో స్థిరపడ్డారు. అక్కడే వ్యాపారాలు చేస్తూ.. రాజకీయాల్లోకి కూాడా ఎంట్రీ ఇచ్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2014లో టీడీపీలో చేరారు. చంద్రగిరిలో టీడీపీ గెలుపు కోసం పని చేయడంతో చంద్రబాబు సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో చేసేదేమి లేక భాజాపా గూటికి చేరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -