Tuesday, May 14, 2024
- Advertisement -

మంత్రి ఆది, పీఆర్‌ల మ‌ధ్య త‌గ్గ‌ని వ‌ర్గ‌విభేధాలు…

- Advertisement -

క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల్లో జ‌మ్ముల‌మ‌డుగు నియోజ‌వ‌ర్గం రాజ‌కీయాలే వేరు. ఈ నియోజ‌క వ‌ర్గానికి ప్యాక్స‌నిజానికి పెట్టింది పేరు. ప్ర‌స్తుత అక్క‌డ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. నియోజ‌క వ‌ర్గ టీడీపీలో వ‌ర్గ‌పోరు పొలిటిక‌ల్ హీట్‌ను పెంచుతోంది. కాంట్రాక్టుల విష‌యంలో ఎమ్మెల్సీ పీఆర్‌, మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి వ‌ర్గీయుల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు కొన‌సాగుతోంది.

ఆది, పీఆర్ ఇద్ద‌రూ రాజ‌కీయ బ‌ధ్ద‌శ‌త్రువులు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపును గెలిన ఆది త‌ర్వాత టీడీపీలోకి ఫిరాయించి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. పార్టీనే న‌మ్ముకొనే ఉన్న పీఆర్ ఆది రాక‌ను పూర్తిగా వ్య‌తిరేకించారు. ఇద్ద‌రి మ‌ధ్య మొద‌ట్లో విబేధాలు తారాస్తాయికి చేరాయి. స్వ‌యంగా చంద్ర‌బాబే ఇద్ద‌రి మ‌ధ్య రాజీకుదిర్చారు.

రాజీలో భాగంగా మూడేళ్ల తర్వాత కాంట్రాక్టు పనులు రామసుబ్బారెడ్డి వర్గానికి ఇచ్చేలా ఒప్పందం జరిగింది. సమయం గడుస్తున్నా కాంట్రాక్టు పనులు తమకు ఇవ్వడం లేదంటూ రామసుబ్బారెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇద్ద‌రి మ‌ధ్య స‌ద్దు మ‌నిగాయ‌నుకున్న విబేధాలు మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చాయి.

ఆదినారాయ‌ణ‌రెడ్డి ఆక‌స్మికంగా పార్టీ ఫిరాయించ‌డంతో వైసీపీ బ‌త‌హీమ‌య్యింది.ఇలాంటి క్లిష్ట‌ప‌రిస్థితుల్లో డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డికి నియోజ‌క‌వ‌ర్గ బాధ్యత‌లను వైఎస్ జ‌గ‌న్ అప్పగించారు. అప్ప‌టి నుంచి ఆది, పీఆర్ నేత‌ల‌కు గ‌ట్టిపోటీ ఇస్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా ప‌ల్గొంటూ పార్టీనీ ప‌టిష్టం చేస్తున్నారు.

న‌ల‌భై ఏళ్ల లోపు యువ‌కుడైన డాక్టర్ సుధీర్ ప్రజ‌ల్లోకి చొచ్చుకెళుతూ వారి క‌ష్టన‌ష్టాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇటీవ‌ల పెద్దదండ్లూరులో త‌న కార్యక‌ర్తల‌పై ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గీయులు దాడికి తెగ‌బ‌డిన‌ప్పుడు నేరుగా ఆ ఊరికి వెళ్లి వైసీపీ అనుచ‌రుల్లో ఆత్మస్థైర్యాన్ని నింప‌డం సుధీర్‌కు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది.

కార్య‌క‌ర్త‌ల విష‌యంలో మంత్రి ఆదిన‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. రోజు రోజుకీ సుధీర్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఎన్నికుల కూడా స‌మీపిస్తున్న త‌రుణంలో టీడీపీలో మాత్రం విబేధాలు స‌ద్దుమ‌నుగ‌డంలేదు. ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు ఇలానే కొన‌సాగితే అది సుధీర్‌కు ఖ‌శ్చితంగా క‌ల‌సి వ‌చ్చే అంశ‌మే. టీడీపీ లో ఉన్న విబేధాల‌ను ఎలా ఉప‌యోగించుకుంటార‌నే దానిపైనే సుధీర్ గెలుపు ఆధార ప‌డింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -