Monday, May 20, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..కొలిక్కి వచ్చేనా?

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ అంటే అస్తవ్యస్తం, అల్లకల్లోలం. ఏ నాయకుడు ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరిని ఎవరు తిడతారో ఊహించడం కష్టం. అయితే కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపుతో కొంత ఊపు వచ్చినా దానికి అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారు. ఒక సమస్యను క్లియర్‌ చేశాం అని ఊపిరి పీల్చుకునేలోపే మరో సమస్యతో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలు అధిష్టానానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా టికెట్ల పంపిణీ కాంగ్రెస్ పార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తోంది.

ఇదిగో తొలి లిస్ట్..అదిగో తొలి లీస్ట్ అంటూ ఉరించడం తప్ప ముందుడుగు పడింది లేదు. దీంతో అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై హైడ్రామా కొనసాగుతనూ ఉంది. 119 స్ధానాలకు వెయ్యికి పైగా దరఖాస్తులు రాగా ఎవరికి టికెట్ దక్కుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం రెండు సార్లు ఎన్నికల కమిటీ భేటీ కాగా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

ఇక తాజాగా జరిగిన కీలక భేటీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. ఈ కమిటీతో అయ్యేదేమీ లేదని, అభ్యర్థుల ఎంపికపై తన అసహనాన్ని వెల్లగక్కారు. తాజాగా రేణుకా చౌదరి సైతం షర్మిలపై తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు. టికెట్‌ ఎవరైనా అడగొచ్చు. టికెట్‌ అడిగేందుకు ఎలాంటి జీఎస్టీ అవసరం లేదు. పాలేరు టికెట్‌కు ఇంకా ఎవరైనా మిగిలారా? అంటూ సెటైర్లు వేశారు.ఇక మరో సీనియర్ నేత పొన్నాల అయితే రేవంత్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తనకు తెలియకుండా తన జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిని నియమించడం ఆయనకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌ను ఫిర్యాదు కూడా చేశారు. అలాగే బీసీ రాగాన్ని ఎత్తుకుని పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. ఇక ప్రధానంగా జనగామ టికెట్ విషయంలో తనను సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంటే పొన్నాల బాంబ్ పేల్చేందుకు రెడీ అయ్యారని సమాచారం. ఏదిఏమైనా కాంగ్రెస్ టికెట్ట వ్యవహారం ఇప్పట్లో కొలిక్కివచ్చేలా కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -