Thursday, May 16, 2024
- Advertisement -

ఏడాది పాటు అవన్ని రద్దు చేయాలి.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేస్తే మరిచిపోయే అలవాటుందని ఏడాదిపాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరాలని ఉందన్నారు. తిరిగి ఎన్నికలు జరిగే ఏడాది వాటిని మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మారెడ్డి ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

జనం మంచివారు అనుకోవాలో,అమాయకులు అనుకోవాలో అర్థం కావట్లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న మేలు వారికి తెలియట్లేదన్నారు. ఎంతోమంది ప్రజలు పనికిమాలిన భావాలకు లోనవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ’24 గంటల ఉచిత విద్యుత్ కాకుండా కేవలం 3 లేదా 4 గంటల విద్యుత్ ఇవ్వాలని కోరుతా. మేము చేస్తున్న మేలు సామాన్యులకు అర్థం కావడంలేదు. జనం మంచివారనలా.. అమాయకులనాలో తెలియడంలేదు. సంక్షేమ పథకాలను నిలిపివేసి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో లక్ష్మారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

వ్యతిరేకత తగ్గేనా?
ప్రజా సంక్షేమ విధానాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందున్నప్పటికీ నిరుద్యోగుల పట్ల అలసత్వం వంటి కారణాలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచేవిగా మారాయి. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురుగాలి వీచిన సంగతి తెలిసిందే. దుబ్బాక స్థానం బీజేపీ దక్కించుకోగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అవమానకర ఫలితాలు టీఆర్ఎస్‌కు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత టీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నది ముమ్మాటికీ నిజం. నీళ్లు,నిధులు,నియామకాలు అన్న నినాదంతో ఏర్పడిన తెలంగాణలో నియామకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల దిశగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ… ఇప్పటికీ చాలామంది నిరుద్యోగులు అపనమ్మకాన్నే వ్యక్తపరుస్తున్నారు. జోనల్ వ్యవస్థ ఓ కొలిక్కి రాకుండా నోటిఫికేషన్లు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు,కార్పోరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇది కేవలం ఎలక్షన్ స్టంటేనా అన్న చర్చ కూడా జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -