Wednesday, May 15, 2024
- Advertisement -

ఏపీలో మంద‌స్తు ఎన్నిక‌లు….

- Advertisement -

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. వ‌చ్చే స‌ర్వ‌త్రిక ఎన్నిక‌లకు 18 నెల‌ల టైం ఉన్నా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెల్లేందుకు అన్ని పార్టీలు సిద్ద‌మ‌వుతున్నాయి. కాకినాడ‌, నంద్యాల ఎన్నిక‌ల్లో గెలిచి జోష్ మీదున్న చంద్ర‌బాబు ఖాలీగా ఉన్న స్థానిక‌ సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డంతోపాటు …ఆరు నెల‌లు ముందుగానె సాధార‌ణ ఎన్నిక‌ల‌కు వెల్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

చంద్ర‌బాబు కేబినెట్ మంత్రులు సైతం తాము త‌మ ప‌ద‌వుల‌కు ఐదు నెల‌ల ముందుగానే రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళుతున్నామ‌ని చెపుతున్నారు. దీంతో ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై వ‌స్తోన్న వార్త‌ల‌కు ఈ మంత్రుల వ్యాఖ్య‌లు మ‌రింత ఊతంగా మారాయి. టీడీపీలోకి 11 మంది ఎమ్మెల్యేలు వెల్తున్నారంటూ ప్ర‌చారం సాగింది. వీరిలో శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడ‌న్న వార్త‌ల‌తో వైసీపీ ఉలిక్కిప‌డింది. దీంతో జ‌గ‌న్ కూడా షాక్ అయ్యి శ్రీకాంత్‌రెడ్డిని వివ‌ర‌ణ కోర‌డంతో ఆయ‌న ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ దీనిని ఖండించారు.

కొంత మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని ఏపీ మంత్రులు ఓపెన్‌గా స్టేట్ మంఎట్లు ఇస్తున్నారు. ఈ వార్త‌ల‌తో ఒత్తిడిలో వైసీపీ ఉన్నా …ఆ పార్టీలోకి ముగ్గురు మాజీ మంత్రులు ఎంట్రీ ఇస్తున్నార‌ట‌. ఈ ముగ్గురు మాజీ మంత్రుల్లో ఇద్ద‌రు కేంద్ర మాజీ మంత్రులు అయితే మ‌రొకరు రాష్ట్ర మాజీ మంత్రి కావ‌డం విశేషం.

గ‌తంలో కాంగ్రెస్ పాల‌న‌లో కేంద్ర మంత్రులుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణితో పాటు క‌ర్నూలు జిల్లాకు చెందిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి వైసీపీలోకి వెళ్లేందుకు జ‌గ‌న్‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించిన‌ట్టు తెలుస్తోంది. కృపారాణికి ప‌లాస ఎమ్మెల్యే సీటు, కోట్ల‌కు క‌ర్నూలు ఎంపీ సీటు ఖ‌రార‌య్యాయ‌ట‌. ప్ర‌కాశం జిల్లాకు చెందిన మ‌హీధ‌ర్‌రెడ్డి కూడా వైసీపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కందుకూరు నుంచి ఆ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నార‌ట‌. వ‌రుస షాకుల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైసీపీకి ఇది బూస్ట్ వంటిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -