Saturday, May 18, 2024
- Advertisement -

జ‌గ‌న్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న మార్పు…

- Advertisement -

వైసీపీ అదినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైఖ‌రిలో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అధికారంలోకి రావాలంటె ఒక్క‌రితో స‌రిపోద‌ని అంద‌ర్ని క‌లుపుకొని పోవాల‌నె భావ‌న ఆయ‌నలో కొట్టొచ్చిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్రను చేప‌ట్ట‌బోతున్నారు జ‌గ‌న్‌. పాద‌యాత్ర విజ‌య‌వంతం కావాలంటె ఒక్క సాక్షితోనె స‌రిపోద‌ని ఇత‌ర మీడియా సంస్త‌ల స‌హాకారం అవ‌స‌రం అనె విష‌యాన్ని గుర్తించిన‌ట్లుంది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం ప్ర‌శాంత్ కిషోర్ స‌ల‌హానేని చెప్ప‌వ‌చ్చు. పొలిటికల్ మేనేజ్మేంట్‌లో స్థానిక, జాతీయ మీడియా యాజమాన్యాలతో అనుబంధం పెంచుకోవాలని సలహా ఇచ్చారని వినికిడి. రాజకీయాల్లో పాదయాత్ర చేసినప్పుడు, ఎన్నికల్లో ప్రత్యేకించి మీడియా అధినేతలతో వ్యూహాత్మకంగా సమావేశం కావాలని ఆయన సూచించారని తెలుస్తోంది. అందుకె ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావుతో భేటీ అవ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మ‌రో సారి ఇత‌ర మీడియా అధినేత‌ల‌తో స‌మావేశం కానున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

రామోజీరావు గత ఏడాది అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పుడు జగన్ వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్మోహనరెడ్డికి ముందు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఈనాడు అధినేత రామోజీరావుతో ఉన్న వైరం అందరికీ తెలిసిందే. వీల్లిద్ద‌రి మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి ఇద్ద‌రు నాయ‌కుల ప్ర‌మేయం ఉన్న‌ట్లు తెలుస్తోంది. వారిలో రా ఒక రెడ్డి సామాజిక వర్గ నేత, మరో కమ్మ సామాజిక వర్గ నాయకుడు మధ్యవర్తిత్వం వహించారా అన్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త – మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఈనాడు అధినేత రామోజీరావు, జగన్ మధ్య మధ్యవర్తిత్వం వహించారని సమాచారం. అంతకుముందు రామోజీరావు, ప్రస్తుత సీఎం – తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మధ్య కూడా రామేశ్వరరావు రాజీ కుదర్చడంలో విజయవంతం అయ్యారు .ఇటీవల రామోజీరావుతో జరిగిన భేటీకి వెళ్లిన జగన్మోహన రెడ్డి వెంట కూడా రామేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -