Monday, May 20, 2024
- Advertisement -

అయోమ‌యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌….

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఆదిలోనె బెడిసికొడుతున్నాయి. రాష్ట్రంలోని ప్ర‌తి ఇంటింటికి న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌ను తీసుకెల్లాల‌ని అన్న వ‌స్తున్నాడు కార్య‌క్రమం ద్వారా చేప‌ట్ట‌నున్న పాద‌యాత్రపై మొద‌ట్లోనె నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. త‌న‌కు వ్య‌క్తిగ‌త మిన‌హాయింపుఇవ్వాల‌ని హైకోర్టులో వేసిన పిటీష‌న్‌పై జ‌గ‌న్‌కు షాక్ త‌గిలింది.

అక్టోబర్ నుండి చేయాలనుకుంటున్న పాదయాత్రకు వీలుగా వ్యక్తిగత హాజరు నుండి తనను మినహాయించాలని జగన్ కోర్టులో పిటీషన్ పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ పిటీష‌న్‌ను విచారించిన కోర్టు దీన్ని తోసిపుచ్చింది. పిటీషన్ అంగీకరించటమా, తోసిపుచ్చటమా అన్నది కోర్టు పరిధిలో ఉన్న అంశమన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ పిటీషన్ తోసిపుచ్చిన సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలే ఆశ్చర్యంగా ఉన్నాయి.

జగన్ పై ఉన్నవి తీవ్రమైన ఆర్ధిక అభియోగాలు కాబట్టి వ్యక్తిగత హాజరునుండి మినహాంపు సాధ్యం కాదని తేల్చేసింది. ప్రతీ శుక్రవారం కోర్టుకు రావాలన్న షరతుపైనే బెయిలు మంజూరు చేసినట్లు గుర్తుచేసింది. మినహాయింపుతో స్వేచ్చను జగన్ దుర్వినియోగం చేస్తారని అనుమానించింది.

వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు పొందేందుకే పాదయాత్రను తెరపైకి తెచ్చినట్లుంది’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. పాదయాత్ర పేరుతో నాలుగేళ్ళ తర్వాత వ్యక్తిగత మినహాయింపు కోరుతున్నారంటూ జగన్ పిటీషన్ పై న్యాయస్ధానం అభిప్రాయపడిం. వ్య‌క్తిగ‌త మిన‌హాయింపుల పిటిష‌న్ల‌ను క్రింది కోర్టులు తోసిపుచ్చేల‌దు క‌దాని కోర్టు జ‌గ‌న్ త‌రుపు లాయ‌ర్‌ను ప్ర‌శ్నించింది. అవసరమైనపుడు క్రిందికోర్టు నుండే మినహాయింపులు తెచ్చుకోండని జ‌గ‌న్‌కు సలహా ఇచ్చారు.

జగన్‌కు మినహాయింపు ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ తన వాదనలు వినిపించింది. ఇందుకు ఏకీభవించిన న్యాయస్థానం మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. దీంతో పాదయాత్రపై జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -