Wednesday, May 15, 2024
- Advertisement -

స్సీక‌ర్‌తో పాటు ఫిరాయింపు నేత‌ల‌కు హైకోర్టు నోటీసులు

- Advertisement -

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో స్పీక‌ర్‌కు, ఫిరాయింపు నేత‌ల‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ అంశం మారోసారి హాట్ టాఫిక్‌గా మారింది. ఫిరాయించిన నేత‌ల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించాల‌ని వైసీపీ ఎన్నిసార్లు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఫిరాయిం‍పు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మంగళవారం వాదనలు వినిపించారు.

పిటిష‌న్‌ను విచారించిన కోర్టు స్పీక‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. ఎంఎల్ఏల ఫిరాయింపులపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన స్పీకర్ చర్యలు తీసుకోలేదని ఆళ్ళ తన పిటీషన్లో పేర్కొన్నారు. పిటీషన్ ను పరిశీలించిన కోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ స్పీకర్ కు, ఫిరాయింపు నేత‌ల‌కు నోటీసిచ్చింది. త‌దుప‌రి విచార‌ణ‌ను మూడు వారాల‌కు వాయిదా వేసింది.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లు అవుతున్నా.. స్పీకర్‌ చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాది సుధాకర్‌రెడ్డి వాదనలతో విన్న ధర్మాసనం​.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో స్పీకర్‌ నిర్దిష్ట సమయంలో స్పందించాల్సి ఉందన్న వాదనతో ఏకీభవించారు. ఇప్పటికే ఫిరాయింపు వ్యవహారాలపై అనేక కేసులు హై కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -