Monday, April 29, 2024
- Advertisement -

రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

- Advertisement -

అంతా ఊహించిందే జరిగింది. తిరుగుబాటు జెండా ఎగురవేసిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ తమ్మినేని సీతారం. ఇందులో అధికార వైసీపీకి చెందిన 4గురు ఎమ్మెల్యేలు ఉండగా టీడీపీకి చెందిన 4గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుతో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ లపై అనర్హత వేటు వేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేల వివరణ తీసుకున్న స్పీకర్‌…అనర్హత వేసేందుకే మొగ్గుచూపారు. అయితే సాధారణ ఎన్నికల్లో వారు పోటీ చేసే అంశంపై ఎలాంటి ఇబ్బందులు లేవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -