Wednesday, May 15, 2024
- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అభిమ‌న్యుడు కాదు..అర్జునుడు..?

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు దేశ వ్యాప్తంగా ఒక ఎత్త‌యితే ఏపీలో మాత్రం మ‌రో ఎత్తు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం పార్టీల మ‌ధ్య మ‌హాభార‌తాన్ని త‌ల‌పించ నున్నాయ‌న‌డంలో సందేహంలేదు. మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని చంద్ర‌బాబు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రో వైపు 2014 ఎన్నిక‌ల్లో కొద్దిలో అధికారం కోల్పోయిన వైసీపీ ఈ సారి అధికారం చేప‌ట్టాల‌ని ఉవ్వీల్లూరుతోంది.

అధికారమే ల‌క్ష్యంగా జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర 24 వ తేదీకి 3000 కి.మీ. పూర్తి చేసుకోనుంది. పాద‌యాత్ర మొద‌లు పెట్టిన‌ప్ప‌టినుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌నుంచి ఊహించ‌ని రీతిలో జ‌గ‌న్‌కు ఆద‌ర‌ణ ల‌భించింద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. అడుగ‌డుగునా ప్ర‌జ‌లు జ‌గ‌న్మోహ‌నుడికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

ఇక ఏపీలో అధికారంలోకి ఎవ‌రొస్తార‌నే విష‌యంలో ఇప్ప‌టికే అనేక స‌ర్వేల ఫలితాలు జ‌గ‌న్‌కే అనుకూలంగా వ‌చ్చాయి. కొద్ది రోజుల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియా టుడే చేసిన స‌ర్వేలో 43 శాతం మంది ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కే జైకొట్టారు. తాజాగా బాబు త‌న ఆస్థాన మీడియాతో ర‌హ‌స్యంగా స‌ర్వే చేయించారంట‌. ఈ స‌ర్వేలో బాబుకు షాక్ త‌గిలే ఫ‌లితాలు వ‌చ్చాయంట‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాఫ్ట్రంలో అన్ని విధాలుగా టీడీపీ ప్రభుత్వం వెనుకబడి ఉందని – బాబు పాలన పట్ల ఏ వర్గంలోను సంతృప్తి లేదని సర్వే వివరాల ద్వారా తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఇసుక దందా ప్రభావం వ‌ల్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్య‌తీరేక‌త ఉంద‌ని తెలుస్తుంది.

సర్వే ఆధారంగా రానున్న ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100 నుంచీ 130 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసిందట. జగన్ పాదయాత్రకు ప్రజాస్పందన ఎక్కువగా ఉండడం వెనుక ప్రభుత్వ వ్యతిరేకతే కారణమని సర్వేలో వెల్లడైనట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముంద‌నేది తెలియాల్సి ఉంది. లేక పోతే ఇదంతా బాబు మైండ్ గేమ్ కావ‌చ్చు. ఏది ఏమైనా స‌ర్వేల‌తో ప‌నిలేకుండా ప్ర‌జ‌ల‌ల్లో జ‌గ‌న్ మ‌రింత చొచ్చుకు పోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -