Saturday, May 18, 2024
- Advertisement -

బాబు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..? ఓటుకు నోటు కేసునుంచి త‌ప్పించుకోలేరా..?

- Advertisement -

ఏపీలో బాబు బినామీగా చెప్పుకొనే ఎంపీ సీఎం ర‌మేష్ ఇల్లు, కార్యాల‌యాల‌పై ఐటీ అధికారులు చేస్తున్న దాడుల‌తో అధికార పార్టీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మ‌రో కోణం వెలుగులోకి వ‌చ్చింది. అయితే రేవంత్ మీద జరిగిన దాడుల ఎపిసోడ్ కు, ఈ సీఎం రమేష్ మీద దాడులకు లింక్ ఉందంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ జరిగిన దాడులన్నీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులపైనే. మొదట నెల్లూరు, చెన్నైలోని బీద మస్తాన్ రావు ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి దాడులతో మొదలయ్యాయి. మస్తాన్ రావు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు.సుజనా చౌదరి, సిఎం రమేష్ కు చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలపై కొత్తగా చెప్పేదేమీ లేదు.

రేవంత్ రెడ్డి మీద దాడులు జ‌రుగుతున్న‌ప్పుడు ఉద్దేశ్య పూర్వ‌కంగానే ఆయ‌న ఆస్తుల‌పై దాడులు చేస్తున్నార‌ని మీడియా ఊద‌ర‌గొట్టింది. తీరా చివ‌ర‌కు చూస్తే ఓటుకు నోటు కేసులో దొరికిన రూ.50 ల‌క్ష‌ల గురించే అధికారులు అడిగార‌ని అప్ప‌ట్లోనే దాని గురించి చెప్పాన‌ని స్వ‌యంగా రేవంత్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

దానికి కొన‌సాగింపుగానే ఇప్పుడు ర‌మేష్ ఇంటిపై ఐటీ దాడులు జ‌రుపుతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసు స‌మ‌యంలో స్టీఫెన్‌స‌న్‌కు ఇవ్వ‌జూపిన రూ.50 ల‌క్ష‌లు సీఎం ర‌మేషే స‌మ‌కూర్చార‌నే వార్త‌లు వినిపించాయి. ఆవిష‌యం నిర్ధారించు కొనే దానికే …ఇప్పుడు ఐటీ అధికారులు ఆయ‌న మీద దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ దాడుల‌ను చూస్తే ఓటుకు నోటుకేసును ఇక ఆల‌స్యం చేయ‌కుండా ప‌క్కాగా ఆధారాలు సేక‌రించి తేల్చేయాడానికే అధికారులు ముమ్మ‌రంగా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో దోషుల‌కు ప‌క్కాగా శిక్ష ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాలు చూస్తుంటే బాబు చుట్టూ ఉచ్చు బిగిసుకోవ‌డం కాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -