Sunday, May 19, 2024
- Advertisement -

కేసీఆర్‌పై ప్ర‌శంశ‌ల వ‌ర్షం కురిపించిన జ‌న‌సేన అధినేత‌….

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సీఎం కేసీఆర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. గ‌తంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌రీంన‌గ‌ర్ గ‌డ్డ‌మీద‌నుంచి కేసీఆర్ తాట‌తీస్తాని హెచ్చ‌రించిన ప‌వ‌న్‌…అదే గ‌డ్డ‌మీద నుంచి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేసిన పవన్ తన రాజకీయ యాత్రను అక్కడినుంచే ప్రారంభించారు .తెలంగాణ సిఎం కేసిఆర్, రేవంత్ చిక్కుకుపోయిన ఓటుకు నోటు కేసు విషయంలో పవన్ స్పందించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం ప్రజలు ఓటుతో తీర్పునిచ్చే ఆయన గెలిచారని చెప్పారు. కాగా, ప్రజా సమస్యలపై ఎలా పడితే అలా తాను మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలపై విమర్శలు చేయడం కోసం తాను పని చేయనని, ప్రజా సమస్యలను అర్థం చేసుకుని, వాటిని ప్రభుత్వాల దగ్గరకు తీసుకువెళ్లి ఆ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. విమర్శలు చేస్తూ రాజకీయాలను అస్థిరపర్చే ఉద్దేశం తనకు లేదని అన్నారు

తెలంగాణ సిఎం కేసిఆర్ ను కలిస్తే తప్పేంటి? నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పడాన్ని తప్పు పడతారా? తెలంగాణ సిఎం కేసిఆర్ స్మార్ట్ సిఎం. ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారన్న నమ్మకం ఉంది. ఓటుకు నోటు కేసులో వివాదం పెద్దది కావొద్దన్న ఉద్దేశంతో నేను సైలెంట్ గా ఉన్నాను. చూసీ చూడనట్లు పోయాను. అన్ని పార్టీలూ అలాగే ఉన్నాయి.

ఏ ప్రభుత్వమైనా సరే.. తన హామీలు అమలు చేసేందుకు ప్రయత్నించాలి. తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పినప్పుడు గౌరవించాలి. ప్రభుత్వాలతో గొడవ పెట్టుకునేందుకు నేను మాట్లాడడంలేదు. రాజకీయ అస్థిరత కోసం మాట్లాడడం లేదు. గొడవ పెట్టుకోవాల్సిన అంశాలున్నా.. వాటి పరిష్కారం కావాలి తప్ప.. గొడవలు పరిస్కారం కాద‌న్నారు.

సామాజిక తెలంగాణ, సామాజిక ఆంధ్రప్రదేశ్, సామాజిక ఇండియా.. ఇవన్నీ రిసోర్సెస్ మేనేజ్ మెంట్ గురించే కదా? వనరులు పంపిణీ సరిగా జరగడంలేదు. అందుకే ఇవన్నీ వస్తున్నాయి. ఎక్కువ శాతం మందికి న్యాయం జరిగేలా ఉండాలి. ఉపాధి కల్పించడం ఏ ప్రభుత్వానికైనా చాలెంజింగ్ విషయమే. ఎకౌంటబులిటీ ఉన్న రాజకీయ పార్టీలు కావాలి.

రెండు రాష్ట్రాల్లో స్థాయి బట్టి.. నా బలాన్ని పట్టి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నది అప్పుడే డిసైడ్ చేస్తాము. ఎవరి మద్దతు అడగను. నా వరకు నేను చేసుకుని పోతాను. కానీ ఎవరి మద్దతు అడగను. తెలంగాణ సున్నితమైనది కాబట్టి సునిశితంగా పర్యటించాలని పార్టీ నేతలు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -