Saturday, May 4, 2024
- Advertisement -

జ‌న‌సేన త‌రుపున న‌ర‌సాపురం ఎంపీగా రాజుగారు పోటీ చేస్తారంట‌…..?

- Advertisement -

ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి..వచ్చే ఎన్నికల్లో త్రికోణ పోరు త‌ప్పేట‌ట్టులేదు. తెలంగాణాలో మ‌హాకూట‌మి ఏర్ప‌డ‌గా…ఏపీలో మాత్రం పొత్తుల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. అయితే అభ్య‌ర్తుల విష‌యంలో మాత్రం రాజ‌కీయ పార్టీల‌కు క్లారిటీ ఉంది. ఇప్ప‌టికే అభ్య‌ర్తులు ఎవ‌ర‌నేదానిపై అన్ని పార్టీలు సైలెంట్‌గా త‌మ ప‌ని తాము కానిస్తున్నారు.

ఇక కొత్త‌గా ఏర్ప‌డి జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటాల‌ని ఉత్సాహంగా ఉంది. అందులో భాగంగానే ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితమే అత్యంత కీలకమైన జిల్లా అయిన తూగో నుంచీ ఆ పార్టీ మొదటి అభ్యర్ధిగా బీసీ శెట్టి బలిజ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ ని ప్రకటించారు.

డెల్టా ప్రాంతం నుంచీ ఎంపీ అభ్యర్ధిగా…ఎవరిని ప్రతిపాదిస్తే బాగుంటుందనే నేపధ్యంలో తనకి అత్యంత కీలకమైన కోటరీ తో ప‌వ‌న్ చర్చలు జరిపారట. సామాజిక వర్గాల పరంగా ఆలోచిస్తే తెలుగుదేశం ,వైసీపీ లు ఇరువురూ కూడా ఎంపీ అభ్యర్ధులుగా క్షత్రియ సామజిక వర్గానికి చెందినా వారినే అభ్యర్ధులుగా నిలబెడుతూ వస్తున్నారు.

అయితే పవన్ కూడ ఇదే సామాజిక వర్గంలోకి ఓ కీలక వ్యక్తిని తన పార్టీ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. అయితే ఆయ‌న ఎవ‌రో కాదు భాజాపా మాజీ ఎంపీ కృష్ణం రాజు. అయ‌న‌తో ఇప్పటికే పవన్ చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది..ఆయన ఒకే చెప్తే నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా ఆయన్ని ఖరారు చేయనున్నారాట.

కృష్ణం రాజు క్షత్రియ సామాజిక వర్గం కావ‌డంతో ఆ కులం అండదండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి వీటితో పాటుగా సినిమా గ్లామర్ ప్రభాస్ ఫ్యాన్స్ సప్పోర్ట్ అదేసమయంలో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సప్పోర్ట్ కూడా ఉంటుందనేది జనసేన నాయకుల అభిప్రాయం. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ఎంపీ నిల‌బెట్టాల‌ని జ‌న‌సేనుడు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -