Wednesday, May 15, 2024
- Advertisement -

మేడాతో వైసీపీ డీల్ ఎంతో తెలుసా..?

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది పార్టీలు మారే నేత‌లు ఎక్కువైయ్యారు. తాజాగా క‌డ‌ప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్డున్ రెడ్డి పార్టీకి గూడ్‌బై చెప్పి వైసీపీ చేర‌డానికి రెడీ అయ్యారు. దీనిలో భాగంగారు మేడా మంగ‌ళ‌వారం వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో భేటీ అయి, పార్టీలో చేరిక‌పై చ‌ర్చించారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి పార్టీలో చేరాల‌ని జ‌గ‌న్ కోర‌డంతో , త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి స్పీక‌ర్ ఫార్మెట్‌లో రాజీనామా చేశారు మేడా. అయితే మేడా మల్లికార్డున్ రెడ్డి చేర్చుకునేందుకు జ‌గ‌న్ భారీ డీల్ కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నిక‌ల‌లో క‌డ‌ప జిల్లా మొత్తం వైసీపీ గెలుచుకుంది, ఒక్క రాజంపేట నియోజిక వ‌ర్గం త‌ప్ప‌. వైసీపీ హ‌వాను త‌ట్టుకుని క‌డ‌ప జిల్లా మొత్తం మీద రాజంపేట నియోజిక వ‌ర్గంలోనే టీడీపీ గెలిచింది. అది కూడా మేడా మల్లికార్డున్ రెడ్డే కావ‌డం విశేషం.రాజంపేట‌లో టీడీపీకి కాస్తా క్యాడ‌ర్ ఉండ‌టంతో పాటు , ఆర్థికంగా బ‌లంగా ఉన్న మేడా మల్లికార్డున్ రెడ్డిను అక్క‌డ పోటీలో నిల‌ప‌డంతో టీడీపీ రాజంపేట‌లో గెలిచింది. అయితే గ‌త కొంత‌కాలంగా టీడీపీపై అసంతృప్తితో ఉన్న మేడా ఈ నెల 31న వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు..

మేడా వైసీపీలో చేరే ముందే జ‌గ‌న్ ఓ కండిష‌న్ పెట్టార‌ని తెలుస్తోంది. క‌డ‌ప జిల్లా ఎంపీ , ఎమ్మెల్యే ఎన్నిక‌ల‌కు అయ్యే మొత్తం ఖ‌ర్చుతో పాటు పార్టీకి భారీ విరాళం కోరిన‌ట్లు కూడా తెలుస్తోంది. రాజంపేట ఎమ్మెల్యే సీటుపై కూడా న‌మ్మ‌కం పెట్టుకోవ‌ద్ద‌ని, పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించిన అనంతరమే సీటుపై స్ప‌ష్ట‌త ఇస్తాన‌ని చెప్పార‌ట జ‌గ‌న్‌. ఎప్ప‌టినుంచో విధేయుడిగా ఉన్నా ఆకేపాటి అమ‌ర్‌నాథ్ రెడ్డికి రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తాన‌ని హామీ ఇచ్చిన జ‌గ‌న్ ,మేడా రాక‌తో ఆకేపాటికు అన్యాయం చేయ‌లేన‌ని జ‌గ‌న్ మేడాతో చెప్పిన‌ట్లు కూడా సమాచారం. వీటిన్నింటికి ఓకే అన్న త‌రువాతే మేడాను పార్టీలో చేర్చుకున్న‌ట్లు స‌మాచారం. రాజంపేట టికెట్ ఇవ్వ‌క‌పోయిన‌, ఎమ్మెల్సీ చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇవ్వ‌డంతోనే మేడా పార్టీలో చేరిన‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ఆర్ధికంగా బ‌లంగా ఉండ‌టంతో ఆయ‌న క‌డ‌ప జిల్లాకు అయ్యే ఎన్నిక‌ల ఖ‌ర్చు భ‌రిస్తాన‌నే వాగ్థ‌నంతో పార్టీలో చేరారట‌. మొత్త‌నికి కొత్త‌గా వ‌చ్చే నేత‌ల‌ను త‌న కండిష‌న్‌ల‌తో షాకిస్తున్నారు జ‌గ‌న్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -