Wednesday, May 22, 2024
- Advertisement -

నాయినిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలని రేవంత్ ప్లాన్

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ కు ధీటుగా సమాధానమిస్తున్న ఏకైక లీడర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ మీద మాటల దాడే కాదు ఎదురుదాడి కూడా చేస్తూ ఢీ అంటే ఢీ అంటూ ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆఫ్ ద రికార్డుగా చెప్పిన మాటల్లోని ఆవేదనను అర్ధం చేసుకున్న రేవంత్ దాన్ని పూర్తిగా క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు. తెలంగాణ తొలి హోంమంత్రి, ఉద్యమకాలం నుంచీ కేసీఆర్ వెన్నంటే ఉన్న నాయకుడు నాయిని నర్శింహారెడ్డిని కేసీఆర్ ఘోరంగా అవమానిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా, తనకు టిక్కెట్ కాదు కదా.. ! అపాయింట్ మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వలేదని నాయిని ఆవేదన వ్యక్తం చేశారని రేవంత్ నిప్పులు చెరిగారు. పైగా ముషీరాబాద్ టికెట్ తనకు లేదా తన అల్లుడికి కేటాయించాలని నాయిని కోరితే, ఎల్బీనగర్ టికెట్ ఇస్తాను, ధనవంతుడైన కాంగ్రెస్ అభ్యర్ధి సుధీర్ రెడ్డిపై గెలవడానికి రూ 10 కోట్లు ఇస్తానని చెప్పారని నాయిని మీడియా మిత్రుల వద్ద ఆఫ్ ద రికార్డ్ చెప్పుకున్నాడు. ఆ పాయింట్ పట్టుకున్న రేవంత్ ఇప్పుడు కేసీఆర్ ని టార్గెట్ చేశాడు. ఎన్నికల సంఘం, ఏసీబీ ఏం చేస్తున్నాయని నిలదీశాడు. ప్రతి నియోజకవర్గానికి రూ 10 కోట్లు చొప్పున కేసీఆర్ కేటాయిస్తున్నారని, తాను పోటే చేసే కొడంగల్ నియోజకవర్గానికి ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వెంటనే కేసీఆర్ సహా హరీశ్, కేటీఆర్, కవిత ఇళ్లు, ఆఫీసుల్లో ఎన్నికల సంఘంతో పాటు ఐటీ, ఏసీబీ అధికారులు సోదాలు చేసి, అరెస్టులు చేయాలన్నారు. కేసీఆర్ 10 కోట్లు ఇస్తానన్నారని నాయిని చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని, విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

అయితే నాయిని వ్యాఖ్యలను రేవంత్ మాత్రం క్యాచ్ చేశారు. మిగిలిన కాంగ్రెస్ నేతలు ఎందుకో అందుకోలేకపోయారు. నాయిని ఆవేదనను చెప్పినట్టే చెబుతూ రేవంత్ కేసీఆర్ ధనరాజకీయాలను ఎండగట్టడంలో సఫలం అయ్యారు. మరోవైపు నాయినిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి మహాకూటమి తరఫున ముషీరాబాద్ నుంచి పోటీ చేయించాలని రేవంత్ కాంగ్రెస్ సీనియర్లతో చర్చలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే అందుకు నాయిని అంగీకరించకపోవచ్చని, అంత తెగింపు అతడిలో లేవని హస్తం పార్టీ సీనియర్లు చెబుతున్నారని సమాచారం. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్ బీజేపీ నేత లక్ష్మణ్ ను ముషీరాబాద్ నుంచి గెలిపించేందుకే నాయినికి, అతడి అల్లుడుకి ముషీరాబాద్ టికెట్ నిరాకరిస్తున్నారు. అందుకే అతడిని ఎల్బీనగర్ నుంచి పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని నాయినికి గట్టిగా చెప్పి, కేసీఆర్ కు నీకంటే బీజేపీ నేత లక్ష్మణ్ ఎక్కువ అయిపోయారు. కనుక నువ్వింక కేసీఆర్ విషకౌగిలి నుంచి బయటపడి కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్ అని చెబితే నాయిని అంగీకరించవచ్చని రేవంత్ భావిస్తున్నారు. నాయిని తమ మాట విని టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరకపోయినా, కేసీఆర్ యూజ్ అండ్ త్రో మెంటాలిటీతో పాటు బీజేపీకి కోసం మొదట నుంచీ ఉన్న తనకే ద్రోహం చేస్తున్నారనే బాధతో అయినా లోపాయికారిగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేయకపోతాడా ? అన్నది రేవంత్ సహా కాంగ్రెస్ నేతల ఆశ. ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కదా ! వారి ఆశ ఫలించవచ్చేమో !?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -