Tuesday, May 14, 2024
- Advertisement -

జ‌గ‌న్‌కు క‌ష్టాలు మొద‌ల‌యిన‌ట్లేనా….

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితం రాజ‌కీయాల‌పై పెను ప్ర‌భావం చూపింది. ఈ ఎన్నిక‌ను ఎన్‌డీఏ ప్ర‌భుత్వం నిశితంగా గ‌మ‌నించింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా గాని లేక వైసీపీతో క‌ల‌సి పోటీచేయాల‌ని భాజాపా పెట్టుకున్న భ్ర‌మ‌లు నంద్యాల‌లో టీడీపీ గెల‌పుతో తొల‌గిపోయాయ‌నె చెప్పాలి. వైసీపీ గెలిచింటె ప‌రిస్థితులు వేరే విధంగా ఉండేవి. ఇక నుంచి జ‌గ‌న్‌కు క‌ష్టాలు త‌ప్ప‌ద‌నె వాద‌న వినిపిస్తోంది.

భూమా బ్రహ్మానంద రెడ్డి బొటాబొటీ మెజారిటీతో కాకుండా భారీ మెజారిటీతో విజయం సాధించడం కూడా ఆయనకు కలిసి వచ్చిందని అంటున్నారు. బిజెపి సహకారం లేకున్నా, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మొండిచేయి చూపినా చంద్రబాబు నంద్యాలను కైవసం చేసుకోవడంతో తాజా సమీకరణాలు కూడా మారుతాయని అంటున్నారు. నంద్యాల ఫలితంతో బిజెపి పెద్దల మనసు మాత్రమే కాకుండా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ మనసు కూడా మారిందని అంటున్నారు. స్వ‌యంగా మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి అభినంద‌న‌లు తెల‌ప‌డం ఆశ్చ‌ర్య‌మే.

కొద్ది రోజులుగా చంద్రబాబును మోడీ విశ్వసించడం లేదని, ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని ప్రచారం ముమ్మ‌రంగా సాగింది. అదే సమయంలో మోడీ జగన్‌తో భేటీ కావడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఎన్డీఎకు మద్దతు ఇచ్చారు. ఇక జ‌గ‌న్ అవ‌స‌రం తీరిపోయింది కాబ‌ట్టి ఇక జ‌గ‌న్‌ను దూరం పెట్టింద‌నే చెప్పాలి.

చంద్ర‌బాబుతో క‌ల‌సి ప‌నిచేయ‌డానికి త‌మ‌కు ఇబ్బందిలేద‌ని….జ‌గ‌న్‌తో పొత్తుగాని, అవ‌గాహ‌న లేద‌ని భాజాపా రాష్ట్ర నాయ‌కులు పురందేశ్వ‌రి వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు ఉండ‌ద‌నె విష‌యంలో భాజాపా పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. నంద్యాల విజ‌యం భాజాపా ఆలోచ‌న‌లో అంత‌గా మార్పు తెచ్చిందా అనేది ఆలోచించాల్సిన విష‌య‌మే. చంద్రబాబు సమర్థత కన్నా జగన్ బలహీనతలే కొట్టొచ్చినట్లు బయటపడ్డాయని చెబుతున్నారు. ఇక నుంచి జ‌గ‌న్‌కు క‌ష్టాలు మొద‌ల‌యిన‌ట్లేన‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. మ‌రి చూడాలి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -