Wednesday, May 15, 2024
- Advertisement -

బుట్టారేణుక‌కు హ్యాండ్ ఇచ్చి చిన‌బాబు… బుట్టాలో టెన్షన్.. అదే వైసీపీలో ఉంటే..?

- Advertisement -

వైసీపీ త‌రుపున గెలిచి ప్ర‌జ‌ల తీర్పున‌కు తిలోద‌కాలు ఇచ్చి త‌మ సొంత లాభాల‌కోసం పార్టీ ఫిరాయించిన నేత‌ల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు ఎవ‌రికీ టీడీపీ టికెట్లు ఇచ్చే ప‌రిస్థితిలేదు. ఇక ఎంపీల విష‌యానికి వారి ప‌రిస్థితి కూడా దారునంగా త‌యార‌య్యింది. క‌ర్నూలు ఎంపీ బుట్టారేణుక ప‌రిస్థితి ఘోరంగా ఉంది.

వచ్చే ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ టిక్కెట్టు ఇచ్చే హామీ మీదే బుట్టా వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన సంగ‌తి తెల‌సిందే. జ‌గ‌న్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీ ఫిరాయించిన బుట్ట‌రేణుఖ చెవిలో టీడీపీ ప్ల‌వ‌ర్ పెట్టింది. గ‌తంలో జిల్లా ప‌ర్య‌ట‌న‌లో చిన‌బాబు లోకేష్ బుట్టా రేణుకను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ బహిరంగంగానే జనాలను కోరారు. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది.

మారిన రాజకీయ పరిణామాల్లో బుట్టాకు టిక్కెట్టు గ్యారింటీ లేదని ప్రచారం జరుగుతోంది. చిన‌బాబు లోకేష్ హ్యాండిచ్చిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ తో టిడిపి పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏపిలో కూడా పొత్తులు లేకపోయినా కనీసం అవగాహనైనా ఉంటుందని రెండు పార్టీల్లోని నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అదే జ‌రిగితే కర్నూలు పార్లమెంటులో కాంగ్రెస్ తరపున కోట్ల సూర్య ప్రకాశరెడ్డి పోటీ చేయటం ఖాయం. కోట్ల పోటీలో ఉన్నపుడు బుట్టాకు చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు దాదాపు లేనట్లేనట.

దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. అక్క‌డ కూడా బుట్టా రేణుఖ‌కు ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఎమ్మిగనూరు నుండి బి. జయనాగేశ్వరరెడ్డి సిట్టింగ్ ఎంఎల్ఏగా ఉన్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏని కాదని చంద్రబాబు ఇక్కడ బుట్టాకు టిక్కెట్టిచ్చే అవకాశం లేనట్లే.

మరి ఎంపిగా పోటీ చేసే అవకాశం లేక ఎంఎల్ఏగా టిక్కెట్టివ్వలేకపోతే బుట్టా పరిస్ధితి ఏమిటి ? ఇపుడీ విషయమే బుట్టాలో టెన్షన్ పెంచేస్తోందట. అదే వైసిపిలోనే ఉండుంటే టిక్కెట్టు గ్యారెంటీతో పాటు మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా ఉండేదేమో ? జ‌గ‌న్‌ను న‌మ్మించి మోసం చేస్తే చివ‌ర‌కు ఇలాంటి గ‌తే ప‌డుతుంద‌నేది బుట్టా రేనుఖేనే ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. ఇక ఎమ్మెల్యే ప‌రిస్థితులు చెప్పాల్సిన ప‌నిలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -