Wednesday, May 15, 2024
- Advertisement -

కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా…. ఏపార్టీకి ఎన్ని సీట్లంటే..?

- Advertisement -

ఎన్నికల దగ్గరపడుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారా అన్న ఉత్కంఠ దేశ ప్రజలందరిలో నెలకొంది. ఎన్డీఏ, కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దేశంలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల వేళ.. తొలిదశ పోలింగ్ కు రంగం సిద్ధం అవుతున్న సమయంలో వార్తా చానళ్లు తమ తమ సర్వేలను ప్రచారంలోకి తీసుకొస్తూ ఉన్నాయి. ప్రాంతీ పార్టీలదే హవా ఉంటుందన్న వేల ఎన్డీటీవీ విడుదళ చేసిన సర్వే అందుకు బలాన్ని చేకూర్చుతోంది. వివిధ పార్టీలకు వచ్చే ఎంపీ సీట్ల విషయంలో తన అంచనాలను వెలువరించింది.

ఏపీ – తెలంగాణ – తమిళనాడు – పశ్చిమబెంగాల్ – ఒడిశాల్లో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు దక్కుతాయనే అంశం గురించి ఎన్డీటీవీ తన అంచనాలను వెలువరించింది. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆ సర్వే స్పష్టం చేసింది. ప్రాంతీయ పార్టీలు 106 లోక్ సభ సీట్ల దాకా గెలుచుకుంటాయని వెల్లడించింది. ఏపీలో 25 ఎంపీ సీట్లకుగాను వైసీపీ 20 పార్లమెంట్ స్థానాలు గెలుచుకు ప్రాంతీయ పార్టీల్లో మూడవ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది.

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 30, తమిళనాడులో డీఎంకే 25 ఎంపీ సీట్లలో విజయం సాధించి మొదటి, రెండో స్థానాలను ఆక్రమిస్తాయని చెప్పింది. ఒడిశాలో బిజూ జనతాదళ్‌ 16 సీట్లు, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ 15 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో మొత్తం 106 ఎంపీ సీట్లతో ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటవుతుందని స్పష్టం చేసింది. ఎన్డీటీవీ ప్రకటించిన సర్వే ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -