Thursday, May 2, 2024
- Advertisement -

రాపాక విషయంలో జగన్ ను ఫాలో అవుతున్న పవన్.. ఎలా అంటే ?

- Advertisement -

జనసైనులకు కోపం తెప్పించిన విషయం ఏంటంటే రాపాక వరప్రసాద్ విషయంలో తమ పార్టీ నిర్లక్ష్యత, నిస్సహాయత. ఈ నేపథ్యంలో రాపకను ఇష్టానుసారం తిడుతున్నారు. జనసేన మీద నమ్మకం లేదు. తాను వైసీపీ నాయకుడిగా కొనసాగుతాను అని రాపాక అన్న తర్వాత కూడా అతనిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏంటి. ఈ ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.

ఈ విషయంలో పవన్ పెదవి విప్పడం లేదు. అయితే సరిగ్గా గమనిస్తే నర్సాపురం రఘరామరాజు విషయంలో కూడా వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు. శాస్వతంగా సస్పెన్షన్ వేద్దామని చూశారు. కానీ ఆ ప్రాసెస్ లో రఘురామ పైచేయి సాధించారు. ఎంతో పవర్ ఉన్నప్పుడు ఒక లీడర్ పై చర్యలు తీసుకుంటే పవర్ అంత అటువైపు మలుపు తిరిగుతోంది. దాంతో అతని రేంజ్ పెంచిన వాళ్లవుతారు. ఇప్పుడు ఎంపీ రాజు గారు రోజూఏదో ఒక విషయంలో జగన్ సర్కార్ ను తిడుతున్నా…. ఆరోపణలు చేస్తున్నా…. గొతుచించుకొని విరుచుకుపడుతున్నా…. పట్టించుకునే నాథుడే లేడు. ఎందుకంటే అతని మాటలకు ఇప్పుడు వైసీపీ నేతలు రియాక్ట్ అవ్వట్లేదు. జగన్ ఇదే విషయాన్ని గమనించాడు.. అలాంటి వారితో ఎలా నడుచుకోవాలో పవన్ కు నేర్పించాడు.

అసలు ఇప్పుడైతే జనాలు ఎంపీ రాజుని పూచిక పుల్ల కన్నా ఘోరంగా తీసిపారేస్తుండడం గమనార్హం. ఇప్పుడు పవన్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. కనీసం షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు కూడా మొగ్గు చూప్పట్లేదు. ఇప్పటికీ అతను ‘వెన్నుపోటు’ దారుడు, నీచ రాజకీయాలు చేసేవాడు అని వైసీపీ, టీడీపీ సపోర్టర్లలో కూడా బలమైన ముద్ర పడిపోయింది. ఎట్టి పరిస్థితిలో జగన్ అతన్ని పార్టీలోకి రానవ్వరు అన్నది అందారి నమ్మకం. జనసేన కూడా అతన్ని మళ్లీ ఆదరించే ఛాన్స్ లేదు. ఐదేళ్లు పదవిలో ఉన్నా కూడా రాపాక… ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ.. అందరి దగ్గర వెన్నుపోటు దారుడు అనే ముద్రతో బ్రతుకుతూ ఉండాలన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

వైఎస్సార్‌ చేయూత.. మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త..!

శంకుస్థాపన వాయిదా.. వెనుకడుగు వేసిన జగన్.. ఎందుకు ?

పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు.. ఎవరి నుంచో తెలుసా ?

జగన్ కోరిక మేరకు దిగివచ్చిన మోడీ.. ఫ్యాన్స్ కు పండగే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -