Saturday, May 18, 2024
- Advertisement -

జనసేన – టీడీపీ..సీట్ల పంపకం కొలిక్కి వచ్చేనా?

- Advertisement -

రాజకీయాల్లో రాటు దేలారు జనసేన అధినేత పవన్. ఈసారి అసెంబ్లీలో ఎలాగైన అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న పవన్ అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా టీడీపీతో కలిసి పోటీచేస్తామని ప్రకటించారు. అంతేగాదు జగన్‌ని ఎదుర్కొనేందుకు ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

ఇందులో భాగంగా శనివారం జనసేన నేతలతో విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. పొత్తులలో భాగంగా పోటీ చేయాల్సిన స్ధానాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఎన్ని సీట్లలో పోటీచేయాలనే దానిపై ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌తో పాటు పొలిట్‌ బ్యూరో సభ్యులు, పీఏసీ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు హాజరుకానున్నారు. అయితే పొలిటికల్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జనసేనకు 20 నుండి 25 అసెంబ్లీ స్ధానాలతో పాటు 2 లేదా 3 ఎంపీ సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే దీనికి జనసేన నేతలు ఒప్పుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే జనసేన నుండి పోటీచేసేందుకు చాలామంది ఆసక్తికనబరుస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే పవన్..టీడీపీతో పొత్తు ప్రకటించిన నేపథ్యంలో మెజార్టీ నేతలు సీట్లు కొల్పోవాల్సి వస్తుంది. దీంతో వీరిని పవన్ ఎలా భుజ్జగిస్తారోనన్నది సమాధానం లేని ప్రశ్నే. అలాగే ఒకవేళ జనసేనకు కేటాయించిన సీట్లలో టీడీపీ అసంతృప్తులను కలుపుకోవడం కూడా సవాల్‌తో కూడిన అంశమే.

అయితే పలువురు జనసేన-టీడీపీ నేతలు పొత్తును స్వాగతిస్తున్నా రాబోయే రోజుల్లో వెన్నుపోటు రాజకీయాలతో ఏ మేరకు సహకరించుకుంటారో తెలియని పరిస్థితి. టీడీపీ – పవన్ టార్గెట్ జగనే కాబట్టి ఈ ఒక్క అంశాన్ని ప్రధానంగా చేసుకుని పట్టువిడుపులతో ముందుకుపోతారా అన్నది తేలాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -