Wednesday, May 8, 2024
- Advertisement -

ప్రజలంటే చిన్నచూపు ఎందుకు జగన్ సార్ !

- Advertisement -

జగన్ సర్కార్ తీసుకునే కొన్ని నిర్ణయాలపై అప్పుడప్పుడు ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమౌతు ఉంటాయి. అయినప్పటికి ప్రజాభిప్రాయాలను అన్నీ సమయాల్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఆ మద్య మంత్రి బొత్స సత్య నారాయణ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అన్నీ ప్రజలకు చెప్పిచేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే ప్రజలపై వైసీపీ వైఖరి ఎలా ఉందో స్పష్టంగా అర్థమౌతుంది. ఈ సంగతి అలా ఉంచితే ఇటీవల ఇప్పటం గ్రామంలో రోడ్ల వెడల్పు కోసం పేదల ఇళ్లను జగన్ సర్కార్ కూల్చుతున్న సంగతి తెలిసిందే.

ఇలా పేదల ఇళ్లను కూల్చడం జగన్ సర్కార్ దౌర్జన్యానికి నిదర్శనం అని ఇతర పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ సర్కార్ వైఖరిపై నిప్పులు చెరుగుతుంటే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏకంగా ఇప్పటం గ్రామంలో పర్యటించి రాజకీయ వేడిని అమాంతంగా పెంచారు. ఇక ప్రభుత్వ పనుల్లో భాగంగా పేదల ఇళ్లను కూల్చడం కరెక్టే అనుకుంటే.. అక్కడే వున్న వైఎస్ విగ్రహాన్ని వదిలేసి కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చడం ఏంటని సామాన్యులు సైతం జగన్ సర్కార్ పై ఫైర్ అవుతున్నారు. జగన్ వివక్ష చూపిస్తున్నడని, కేవలం కక్ష్య పూరితంగానే ఇళ్లను కూల్చుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ ఆరోపిస్తున్నారు.

ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని పవన్ హెచ్చరిస్తున్నారు. పేదల ఇళ్లను అడ్డు అదుపు లేకుండా కూల్చిన జగన్ సర్కార్.. వైఎస్ విగ్రహానికి ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు జగన్ సర్కార్ వద్ద సమాధానం లేదనేది అందరికీ తెలిసిందే. అయితే ఎవరు ఒప్పుకున్న.. ఒప్పుకోకపోయిన జగన్ సర్కార్ పై ప్రజాలో ఎంతో కొంత సానుకూలత ఉంది కానీ ఇలా ప్రజలపై వివక్ష చూపించడం వల్ల సానుకూలత కాస్త వ్యతిరేకంగా మారి ఓటు ద్వారా గట్టిగా బుద్ది చెబుతారని రాజకీయవాదుల నుంచి వినిపిస్తున్న మాట.

ఇవి కూడా చదవండి

బీజేపీ పై సెటైర్లు : డబుల్ ఇంజన్ సర్కార్ లో.. ఇంజన్ ఉందా ?

కాంగ్రెస్ ఘోర ఓటమి.. బాధ్యత ఎవరిది ?

“రాజన్న.. సన్యాసం ఎప్పుడన్నా ” కోమటిరెడ్డిపై సెటైర్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -